• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

రోడ్డు ప్రమాదంలో విశాఖ దంపతులు మృతి

VSP: అనంతరపురం (D)లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖకు చెందిన దంపతులు మృతి చెందారు. చిన్నముషిడివాడకు చెందిన రామ్ సుధీర్, లావణ్య దంపతులు అనంతపురంలో ఉంటున్నారు. వీరిద్దరూ తమ కుమారుడు ఆద్విక్తో కలిసి కారులో హంపీ వెళ్తుండగా.. ఎదరుగా వస్తున్న మరో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

October 5, 2025 / 07:58 AM IST

లాడ్జిలో ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

CTR: కుప్పం మున్సిపాలిటీ సామగుట్ట పల్లెకు చెందిన ముత్తు భార్య లక్ష్మి పట్టణంలోని ఓ ప్రైవేటు లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 3 రోజులుగా లక్ష్మీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. అయితే 3 నెలలుగా లాడ్జిలో రూమ్ తీసుకుని వచ్చిపోయేదని తెలుసుకున్నారు. లాడ్జి తలుపులు బద్దలు కొట్టగా అప్పటికే ఉరి వేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

October 5, 2025 / 06:36 AM IST

కోచింగ్ సెంటర్‌లో పేలుడు.. ఇద్దరు మృతి

ఉత్తరప్రదేశ్ ఫరూఖాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడుకు కోచింగ్ సెంటర్ నేలమట్టమైంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

October 4, 2025 / 07:26 PM IST

ప్రయాణికుల రైలుపై రష్యా దాడి..!

ఉక్రెయిన్‌లోని ఓ రైల్వేస్టేషన్‌పై రష్యా డ్రోన్ దాడికి దిగింది. సుమీ రీజియన్‌లోని షోస్‌త్కాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. రైల్వేస్టేషన్‌లో ఓ రైల్లో మంటలు చెలరేగిన దృశ్యాలను ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ఈ దాడిలో పలువురు మృతిచెందినట్లు సమాచారం.

October 4, 2025 / 03:44 PM IST

వివాహేతర సంబంధంతోనే సురేష్ హత్య

AP: పశ్చిమ గోదావరి జిల్లాలో గత నెల 23న అదృశ్యమైన సురేష్ కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధంతో సురేష్‌ను భార్య హత్య చేయించినట్లు గుర్తించారు. సురేష్ భార్య, న్యాయవాది సత్యనారాయణతోపాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సురేష్ మృతదేహం తూర్పుగోదావరి జిల్లా రామేశ్వరం వద్ద గోదావరిలో దొరికినట్లు సమాచారం.

October 4, 2025 / 02:35 PM IST

ఆ మృతుడి వివరాలు లభ్యం

KKD: అన్నవరం రైల్వేస్టేషన్ యార్డ్ పరిధిలో జరిగిన రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఝార్కాండ్‌కు చెందిన సులం పాన్‌గా పోలీసులు శుక్రవారం గుర్తించారు. ఆ యువకుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. ఈ సమయంలో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే హెడ్ కానిస్టేబుల్ మోహన్ రావు తెలిపారు.

October 4, 2025 / 02:14 PM IST

HYDలో ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

HYD: నగరంలో రూ.40,000 ఈ సిగరెట్లు విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. హుస్సేన్ (30) ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపిన సౌత్ ఈస్ట్ జోన్ పోలీస్ అధికారులు, అతని నుంచి హోండా యాక్టివా, ఒక ఆపిల్ మొబైల్ సైతం స్వాధీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ నికోటిన్ పదార్థాల విక్రయంపై కేసులు నమోదు చేశారు.

October 4, 2025 / 01:15 PM IST

భారత్‌కు నీరవ్‌మోదీ అప్పగింత.. ఎప్పుడంటే?

భారత్‌లో పలు బ్యాంకులను రూ.వేల కోట్ల మేర మోసం చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడానికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. నవంబర్ 23న అతడిని భారత్‌కు అప్పగించనున్నట్లు సమాచారం. ఈ అప్పగింత ప్రక్రియ పూర్తయితే, రూ.వేల కోట్ల మోసంలో ప్రధాన నిందితుడైన నీరవ్‌ను విచారించేందుకు మార్గం సుగమమవుతుంది.

October 4, 2025 / 12:23 PM IST

కౌడిపల్లి చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

MDK: కౌడిపల్లి మండల కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ బతుకమ్మ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఎవరైనా మృతుడుని గుర్తిస్తే కౌడిపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

October 4, 2025 / 12:06 PM IST

ఇంటి యజమానిపై కత్తితో దాడి

VSP: విశాఖలో ఓ ఇంటియజమానిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. పాత అగనంపూడిలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో సన్యాసిరావు అనే వ్యక్తి ఇంట్లోకి దుండగుడు చొరబడ్డాడు. ఆ సమయంలో మెలుకువ వచ్చిన సన్యాసిరావు దుండగుడిని అడ్డగించడంతో కత్తితో దాడి చేసి పరారయ్యాడు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు దువ్వాడ పోలీసులు తెలిపారు.

October 4, 2025 / 11:40 AM IST

పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

SDPT: మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో నారదాసు శ్రీకాంత్ (27) ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి పురుగు మందు తాగాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్‌కి తీసుకెళ్లెలారు. చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందాడు.

October 4, 2025 / 10:54 AM IST

డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి

CTR: కేజీసత్రం సమీపంలో బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై బైక్ డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాలు మేరకు.. పాలసముద్రంకి చెందిన రామచంద్రయ్య సెట్టి బెంగళూరులో నివాసం ఉంటూ చిత్తూరు వైపు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న సమయంలో డివైడర్‌ని ఢీకొన్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చరీకి తరలించారు.

October 4, 2025 / 10:05 AM IST

భీమిలిలో పేలిన మందుగుండు

VSP: విశాఖలో మందుగుండు పేలి ముగ్గురు యువకులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఇవాళ ఉదయం భీమిలి మండలం వలందపేటలో జరిగింది. దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రతిష్ఠించిన అమ్మవారి నిమజ్జనోత్సవంలో బాణసంచా కోసం మందుగుండు సామగ్రిని తీసుకొచ్చి తయారు చేస్తుండగా పేలింది. దీంతో మహేశ్, వాసు, కనకరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆరిలోవ ఆసుపత్రికి తరలించారు.

October 4, 2025 / 09:45 AM IST

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

KDP: తొండూరు మండలంలోని మల్లేల గ్రామానికి చెందిన 28 ఏళ్ల దొడ్డి శ్రీనాథ్ అనే యువ రైతు, అప్పుల బాధను తట్టుకోలేక శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. జీవనోపాధి కోసం వ్యవసాయం చేయడానికి అప్పులు చేశాడు. అయితే, పంటలు చేతికి రాకపోవడం, ఆశించిన దిగుబడి లేకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. రుణాలు ఎలా తీర్చాలో తెలియక విషం త్రాగి మృతి చెందాడు.

October 4, 2025 / 09:35 AM IST

సముద్రంలో పడి యువకుడి మృతి

VSP: జోడిగుడ్లపాలెం నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన గరికిన నూకరాజు ప్రమాదవశాత్తు పడిపోవడంతో మృతి చెందాడు. ఇదే ప్రాంతానికి చెందిన ఐదుగురితో కలిసి నూకరాజు శుక్రవారం ఉదయం తెప్పపై వేటకు వెళ్లగా సముద్రం మధ్యలో నూకరాజు అదుపుతప్పి పడిపోయాడు. ఒడ్డుకు వచ్చిన వారు ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం సమయంలో నూకరాజు మృతదేహం బయటపడింది.

October 4, 2025 / 08:50 AM IST