SKLM: కొత్తూరు మండలం కాశీపురంలో ఆదివారం కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. అరసవిల్లి నుంచి ముగ్గురు కారులో వస్తుండగా మెట్టూరు సమీపంలో వాహనం అదుపుతప్పి పొలంలోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో కొత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ELR: ఆర్ఆర్ పేట పరిధిలో నివాసం ఉంటున్న ప్రియాంక (25) అనే వివాహిత ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త వేధింపులు, అనుమానంతో ఉరి వేసుకుని మృతి చెందిందని, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
MDK: శివంపేట మండలం తాళ్లపల్లి తండాకు చెందిన వ్యక్తి కుటుంబ కలహాలతో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. శివంపేట మండలం తాళ్లపల్లి తండాకు చెందిన ధనావత్ మోతిలాల్(38)కు ఇద్దరు భార్యలు ఉండడంతో కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయి. మనస్థాపానికి గురైన మోతిలాల్ పురుగుల మందు సేవించాడు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.
PLD: రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ కౌన్సిలర్ గాయపడిన ఘటన పిడుగురాళ్ల పట్టణ శివారులోని కొండమోడు వద్ద ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే పిడుగురాళ్ల పురపాలక సంఘ పరిధిలోని లెనిన్ నగర్ కాలనీ తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ ద్విచక్ర వాహనంపై వస్తున్న చిన్నాను లారీ ఢీకొంది. ఈ ఘటనలో చిన్నా తీవ్ర గాయాలపాలయ్యాడు.
MDK: స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. కొల్చారం మండలం రంగంపేటకు చెందిన కార్తీక్ (24) మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి మిత్రుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి HYDకి వెళ్తుండగా మియాపూర్ వద్ద ప్రమాదానికి గురయ్యాడు.
TPT: వాకాడు మండలం వాళ్లమేడు గ్రామానికి చెందిన బండి శేషయ్య(73) అనే వ్యక్తి చలిగాలులకు మృతి చెందారు. చలిగాలులకు తీవ్ర ఇబ్బంది పడిన శేషయ్యను ఆదివారం ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా జీవచ్ఛవంలాగా పడిఉండడంతో స్థానిక వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారని మృతుని బంధువులు తెలిపారు.
కోనసీమ: ఉప్పలగుప్తం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17ఏళ్ల విద్యార్థిని అదృశ్యంపై రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి కేసు నమోదు అయింది. ఆమె రాజమండ్రిలో హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. హాస్టల్ నుంచి కాలేజీకి వెళ్లిన ఆమె తిరిగి రాలేదని వసతి గృహ సంక్షేమ అధికారిణి నాగమణి ఇచ్చిన ఫిర్యాదుపై రాజమండ్రిలో కేసు నమోదు చేశారు.
TPT: శ్రీకాళహస్తి మండలం ఓటుగుంట ఎస్టీ కాలనీలో శనివారం రాత్రి యువకుడు రవిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా, రవిని వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. రవి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయన స్వస్థలం వెంకటాపురం కాగా ఏడేళ్లుగా ఓటుగుంట ఎస్టీ కాలనీలో ఉంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కోర్టులో విచారణ సందర్భంగా లేబర్ కోర్టు జడ్జికి ఓ వ్యక్తి రూ.35 వేల లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడు. జడ్జికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన బాపు సోలంకి అనే వ్యక్తిని గుజరాత్ అవినీతి నిరోధక బ్యూరో అరెస్టు చేసింది. సోలంకి కోర్టు గదిలోకి వెళ్లి జడ్జి టేబుల్‌పై మూసివున్న కవరు ఉంచాడు. దాన్ని తెరవమని న్యాయమూర్తి తన సిబ్బందిని కోరగా.. కవరు లోపల రూ.35,000 కనిపించినట్లు అధికారులకు తెలిపారు.
KRNL: ఆటో ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన రాజాం పట్టణంలోని హీరో బైక్ షో రూమ్ వద్ద శనివారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు మేరకు ఓ ప్యాసింజర్ ఆటో వేగంగా వచ్చి రోడ్డును దాటుతున్న సుమారు 60 ఏళ్ల వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తికి తలపై తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియలేదు.
వరంగల్: నర్సంపేట ప్రధాన రహదారి లేబర్ కాలనీ అపోలో ఫార్మసి వద్ద ఆదివారం రోడ్డు దాటుతున్న ఇద్దరు దంపతులను ఆటో ఢీకొట్టింది. దంపతులను ఆస్పత్రికి తరలించగా లేబర్ కాలనీకి చెందిన ల్యాదేళ్ల సంపూర్ణ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు.
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను విచారణ నిమిత్తం హాజరుకావాలని ఈడీ కోరింది. పోర్న్ రాకెట్ కేసులో అశ్లీల చిత్ర నిర్మాణం, ప్రసారం కేసులో భాగంగా అతని ఇల్లు, కార్యాలయాలపై దాడి చేసిన రెండు రోజుల అనంతరం ఇది జరిగింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని కుంద్రాను కోరినట్లు వర్గాలు తెలిపాయి.
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను విచారణ నిమిత్తం హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. పోర్న్ రాకెట్ కేసులో అశ్లీల చిత్ర నిర్మాణం, ప్రసారం కేసులో భాగంగా అతని ఇల్లు, కార్యాలయాలపై దాడి చేసిన రెండు రోజుల అనంతరం ఇది జరిగింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని కుంద్రాను కోరినట్లు వర్గాలు తెలిపాయి.
NLG: నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లిలో విషాదం నెలకొంది. స్థానికుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన కామసాని వేణుకుమార్ రెడ్డి(29) శనివారం రాత్రి 10గం.ల సమయంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం కమాన్ దగ్గరలోని రైల్వే ట్రాక్ పై పడుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు కొద్దిరోజుల క్రితమే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
NZB: వ్యవసాయ పనులకు వెళ్తూ ఓ రైతు మృత్యువాత పడిన విషాద ఘటన. పెర్కిట్‌కు చెందిన శ్రీరాం అశోక్ ఆదివారం ఉదయం వ్యవసాయ పనుల కోసం బైక్ పై వెళ్తుండగా నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం జాతీయ రహదారిపై రిలయన్స్ పెట్రోల్ పంప్ సమీపంలో ఢీ కొట్టింది. ఈప్రమాదంలో అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.