AP: పోలవరం ప్రాజెక్టును రేపు CM చంద్రబాబు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రాజెక్టు వద్ద బందోబస్తుకు వెళ్లిన బాంబ్‌స్క్వాడ్ డీఎస్పీని తేనెటీగలు దాడి చేశాయి. ముందస్తుగా పోలవరం స్పిల్ వే గేట్ వద్ద బాంబ్ స్క్వాడ్ డీఎస్పీ రామకృష్ణ తనిఖీలు చేశారు. ఈ సమయంలో తేనెటీగలు ఆయనపై ఒక్కసారిగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన డీఎస్పీని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రామకృష్ణకు డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారు.