• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

మాచర్లలో ఆటో బోల్తా.. ఒకరి మృతి

PLD: మాచర్ల మండలం కంభంపాడు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. రెంటచింతల నుంచి మాచర్ల వస్తున్న ఆటో గేదెను తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రెంటచింతలకు చెందిన కత్తి సుబ్బయ్య(50) మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ వైద్య శాలలో చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు రిఫర్ చేశారు.

December 16, 2024 / 07:56 PM IST

గడ్డి వాము దగ్ధం

NGKL: అచ్చంపేట పట్టణ సమీపంలోని పలకపల్లి రోడ్డులో మధునాగుల చంద్రయ్య వ్యవసాయ పొలంలో నిల్వ ఉంచిన వరిగడ్డి వాము సోమవారం  అగ్ని ప్రమాదంతో పూర్తిగా దగ్ధమైంది. అచ్చంపేట ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. పశువుల కోసం నిల్వ ఉంచుకున్న దాదాపు 50 వేల విలువ చేసే వరిగడ్డి దగ్ధం అయ్యిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

December 16, 2024 / 07:29 PM IST

అగ్నిప్రమాదం.. పలువురి పరిస్థితి విషమం

రాజస్థాన్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జైపూర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగి.. పొగ వ్యాపించడంతో 12 మంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. స్పృహ కోల్పోయిన వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆ సెంటర్‌లో 350 విద్యార్...

December 16, 2024 / 06:46 PM IST

రైలు కింద పడి ఇద్దరు యువతుల ఆత్మహత్య

ATP: పెనుగొండ రైల్వే స్టేషన్ సమీపంలోని మంగాపురం వద్ద సోమవారం గూడ్స్ రైలు కింద పడి ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు మృతులు ఒరిస్సాకు చెందిన యువతులుగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

December 16, 2024 / 05:03 PM IST

BREAKING: గురుగ్రామ్‌లో తీవ్ర ఉద్రిక్తత

హర్యానాలోని గురుగ్రామ్‌లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. రెస్టారెంట్‌లో ఘర్షణ చెలరేగడంతో అల్లరిమూకలు కారును తగలబెట్టారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అల్లరిమూకలను చెదరగొట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 16, 2024 / 04:49 PM IST

‘రైలు ఢీకొని కానిస్టేబుల్ మృతి’

ELR: ఏలూరులో రైలు ఢీకొనడంతో ఏపీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రైల్వే ఎస్సై సైమన్ వివరాలు వెల్లడించారు. గొల్లయిగుడెంకు చెందిన మధుబాబు (41) కాకినాడలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సెలవులకు ఇంటికి వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో రైలు ఢీకొనడంతో మృతి చెందాడన్నారు.

December 16, 2024 / 04:18 PM IST

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

నంద్యాల: కుటుంబ కలహాలతో అరుణకుమారి అనే మహిళ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బనగానపల్లె మండలం జిల్లెల్ల గ్రామంలో ఈ సంఘటన జరిగింది. మృతురాలికి భర్త ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

December 16, 2024 / 04:05 PM IST

తిరుపతి-శ్రీకాళహస్తి రోడ్డుపై బోల్తా పడ్డ లారీ

TPT: శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం తిరుపతి-శ్రీకాళహస్తి మార్గంలోని సీతారాంపేట ఎఫ్‌సీఐ గోడౌన్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి లారీ బోల్తా పడిన ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ జయచంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడిని 108 వాహనం ద్వారా స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.

December 16, 2024 / 02:55 PM IST

ఆత్మకూరులో యువకుడు సూసైడ్

WNP: ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నితీష్ కుమార్(18) ఆదివారం రాత్రి ఇంట్లో చీరతో ఉరేసుకున్నాడు. నితీశ్ గత కొంతకాలంగా బెంగళూరులో గ్లాస్ వర్క్ చేసేవాడు. అయితే మూడు నెలల నుంచి ఇంటి వద్దనే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 16, 2024 / 02:05 PM IST

చికిత్స పొందుతూ కాంగ్రెస్ నాయకుడి మృతి

WGL: భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ భర్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాచర్ల సారయ్య (57) హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతూ నేటి (సోమవారం) ఉదయం మృతి చెందాడు. అనారోగ్యం కారణంగా వైద్య చికిత్స కోసం ఆయన ఇటీవల నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. గతంలో ఆయన నీటి సంఘం ఛైర్మన్, ఉప సర్పంచ్ పదవుల్లో పనిచేశారు.

December 16, 2024 / 01:14 PM IST

పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గం దక్షిణ చిరువోలులంక గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం(35) సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతడిని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సుబ్రహ్మణ్యంకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

December 16, 2024 / 01:00 PM IST

రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

MNCL: మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేచిని రైల్వే స్టేషన్ సమీపంలో మేడి సాయికుమార్ (20) అనే యువకుడు సోమవారం మద్యం మత్తులో సంఘమిత్ర ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్ల రైల్వే పోలీసులు తెలిపారు.

December 16, 2024 / 12:39 PM IST

బీచ్ రోడ్డులో ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

కృష్ణా: మచిలీపట్నం బీచ్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఎదురుగా వస్తున్న ఆటో ద్విచక్ర వాహనదారుడిని డీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనదారుడికి కాలు విరిగింది. 108 వాహనంలో బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

December 16, 2024 / 11:35 AM IST

అనంతపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

E.G: నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి విశాఖపట్నంకు 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం, మినీ వ్యాన్ స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.   

December 16, 2024 / 11:35 AM IST

చెరువులోకి దిగి బీఫార్మసీ విద్యార్థి మృతి

GNTR: జంగంగుంట్లపాలెం కేసీ రెడ్డి కళాశాలలో బీఫార్మసీ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్ధి మృతి చెందాడు. తెనాలికి చెందిన రంజిత్.. తాను ఉంటున్న హాస్టల్లో నీరు రాకపోవడంతో మేరికపూడి చెరువులోని మోటార్ బాగు చేయడానికి మెకానిక్‌తో కలిసి రంజిత్ దిగాడు. ఈక్రమంలో మట్టిలో కూరుకుపోయి రంజిత్ చనిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. 

December 16, 2024 / 11:17 AM IST