KRNL: రాజంపేటలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. కోవెలకుంట్లకు చెందిన కిరణ్ రాజంపేట ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. శనివారం కిరణ్ పుట్టినరోజు కావడంతో పులివెందులకు చెందిన ఫ్రెండ్ బన్నీ చెన్నైలో చదువుతూ రాజంపేటకు వచ్చారు. కాగా, వీరి ఇరువురినీ ఆర్టీసీ బస్సు ఢీకొని పుట్టినరోజు నాడే మృతి చెందాడు.