NLR: ప్రకాశం జిల్లాలో అదృశ్యమైన ఓ బాలుడు నెల్లూరు జిల్లాలో దొరికిన ఘటన శనివారం జరిగింది. ప్రకాశం SP మాట్లాడుతూ.. ఒడిశా నుంచి నాలుగేళ్ల క్రితం ప్రదీప్ దంపతులు ఇద్దరు పిల్లలతో ఒంగోలు వచ్చారు. పక్క ఇంట్లో బాయ్ ఫ్రెండ్‌తో ఉంటున్న ఓ మహిళ ప్రదీప్ పిల్లలపై కన్నేసింది. ఫ్రెండ్‌తో కలిసి శుక్రవారం 10 నెలల బాలుడిని ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. పోలీసులు గాలించగా.. నెల్లూరులో దొరికినట్లు వెల్లడించారు.