MBNR: రైలు నుంచి పడి ఒక వ్యక్తి తీవ్ర గాయాల పాలైన ఘటన దేవరకద్ర రైల్వే స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ అక్బర్ వివరాల ప్రకారం.. దేవరకద్ర రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని అంబులెన్స్ లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించామన్నారు.