SKLM: నరసన్నపేట మండలంలో జమ్ము గ్రామ పరిసరాలలో ముందస్తు సమాచారంతో పేకాట శిబిరంపై దాడి చేయడం జరిగిందని ఎస్సై సి. హెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. శనివారం జమ్ము గ్రామంలోని ఒక మిల్లు వద్ద పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. 1,300 రూపాయలు, ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. 8 మందిని అరెస్టు చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.