SRPT: ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నసంఘటన తుంగతుర్తి మండలం గొట్టిపర్తిలో శనివారం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన తునం అంజయ్య(36) గత కొన్ని సంవత్సరాలుగా భార్య పిల్లలతో హైదరాబాద్లో స్థిరపడ్డాడు. శనివారం తన స్వగ్రామమైన గొట్టిపర్తిలో వ్యవసాయ క్షేత్రంలోచెట్టుకు ఉరివేసుకొని మరణించాడు.