SKLM: కంచిలి మండలం కొన్నాయిపుట్టుగ సమీపంలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మాణిక్య పురానికి చెందిన రమేష్ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా అటుగా వస్తున్న ద్విచక్రవాహనదారుడు ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.