HYD: శంకర్పల్లి PS పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధి హుస్సేన్పూర్ గ్రామం నుంచి ఓ వ్యక్తి బైక్పై 13వ తేదీ అర్ధరాత్రి కొత్తపల్లి గ్రామం వైపు బయల్దేరాడు. కొత్తపల్లి గ్రామ బీరప్ప ఆలయం సమీపానికి రాగానే గుర్తుతెలియని వాహనం అతడి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.