VSP: భార్యను చంపేస్తానని బెదిరిస్తున్న భర్తపై విశాఖ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసును శనివారం నమోదు చేశారు. నగరంలో చిన్న వాల్తేరుకు చెందిన దుర్గాప్రసాద్ శ్రావణి అనే యువతిని 2022లోవివాహం చేసుకున్నాడు. సంవత్సరం తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో భర్తపై వేధింపులు కేసు పెట్టారు. ఇటీవల చంపేస్తానని బెదిరిస్తూ ఉండడంతో శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.