KKD: అన్నవరం రైల్వేస్టేషన్ యార్డ్ పరిధిలో జరిగిన రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఝార్కాండ్కు చెందిన సులం పాన్గా పోలీసులు శుక్రవారం గుర్తించారు. ఆ యువకుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. ఈ సమయంలో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే హెడ్ కానిస్టేబుల్ మోహన్ రావు తెలిపారు.