ELR: ద్వారకాతిరుమల మండలం నారాయణపురంలో కోడిపందాలపై ఆదివారం ద్వారకాతిరుమల ఎస్ఐ సుధీర్ సిబ్బందితో దాడి చేశారు. పోలీసుల దాడిలో 9 మందిని అరెస్ట్ చేశారు. గ్రామంలో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఈ దాడి చేశారు. 9 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 52,080 నగదు, 5బైకులు, 2 కోడి పుంజులు స్వాధీనం చేసుకున్నట్లు ద్వారకాతిరుమల ఎస్ఐ సుధీర్ తెలిపారు.