AP: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. ఇంటి నిర్మాణ విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిపై పాశవికంగా దాడి చేశారు. కత్తులు, కర్రలతో ప్రత్యర్థులు విరుచుకుపడ్డారు. దీంతో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.