W.G: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గోపాలపురం మండలం పెద్దగూడెంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. పాస్టర్ ఏలేటి భూషణంకు చెందిన ఇంట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో పక్కనే ఉన్న ప్రార్ధన మందిరంలోకి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.4 లక్షల విలువైన ఏసీ, ఫ్రిడ్జ్ వంటి సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైంది.