CTR: కె.పట్నం సమీపంలో ఉన్న బావిలో అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం (74) అనే వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు తవణంపల్లి ఎస్ఐ చిరంజీవి తెలిపారు. గత ఐదు రోజుల క్రితం అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు. గాలింపు చర్యల్లో భాగంగా ఆదివారం బావిలో అతని మృతదేహం లభ్యమైందని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ మార్చురికి తరలించామన్నారు.