HYD: వారాసిగూడ PS పరిధిలోని రాంనగర్ చిన్న చౌరస్తా పక్క వీధిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. SI సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. GHMC కాంట్రాక్ట్ స్వీపర్ మచ్చ శ్రీకాంత్(32)కు తన భార్యతో కొంతకాలంగా విభేదాలున్నాయి. ఇటీవల PSలో దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. భార్య ప్రైవేట్ జాబ్ డ్యూటీకి వెళ్లగా ఇంట్లో ఉన్న 5 ఏళ్ల పాప చూస్తుండగానే శ్రీకాంత్ ఉరి వేసుకున్నాడు.