AP: కాకినాడ(D) సామర్లకోటలో విషాదం చోటుచేసుకుంది. వేట్లపాలెంలో ఓ ఇంటి నిర్మాణం విషయంలో వివాదం చెలరేగింది. ఇరువర్గాల ఘర్షణలో ముగ్గురు హత్యకు గురైయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన కాల్దారి ప్రకాశం, చంద్రరావు, ఏసుబాబు హత్యకు గురైనట్లు సమాచారం. మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలు కాగా.. కాకినాడ GGHకు తరలించారు. కత్తులతో వచ్చి కుటుంబంపై 20 మంది ప్రత్యర్థులు దాడి చేసినట్లు తెలుస్తోంది. డీఎస్పీ శ్రీహరిరాజు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.