NZB: ఆర్మూర్ ప్రమాదవశాత్తు కాలువలో పడి వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన పెర్కిట్‌లో చోటు చేసుకుంది. SHO సత్యనారాయణ గౌడ్ వివరాల ప్రకారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా సిబ్దారా గ్రామానికి గాంధీ సమాన్వాడు(60) కూలీ పని చేసుకుంటూ పెర్కిట్‌లో జీవిస్తున్నాడు. శనివారం సాయంత్రం పెర్కిట్‌లోని మాటు కాలువలో చేపల వేటకు వెళ్లగా.. ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు.