• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

POCO C55: మార్కెట్లోకి వచ్చిన పోకో సీ55 సిరీస్..ధరెంతో తెలుసా?

భారత మార్కెట్లోకి 10 వేల రూపాయాల్లోపే అద్భుతమైన ఫోన్ అందుబాటులోకి వచ్చింది. POCO C55 స్మార్ట్‌ఫోన్ రూ. 9,499 వద్ద ప్రారంభమైంది. 50MP డ్యూయల్ కెమెరా, 5,000mAh బ్యాటరీ, MediaTek Helio G85 చిప్‌సెట్ వంటి మంచి ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది.

February 21, 2023 / 09:53 PM IST

Central Government: రూ.6 వేల నిరుద్యోగ భృతిపై పీఐబీ క్లారిటీ

ప్రధాన మంత్రి బేరోజ్‌గారి భత్తా యోజన కింద దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్రం ప్రతి నెల రూ.6,000 భృతిగా ఇస్తోందని సామాజిక మాధ్యమాల్లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. కొందరైతే అప్లై చేసుకోవడానికి ఫేక్ లింకులు కూడా పెడుతున్నారు. ఈనేపథ్యంలోనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ఈ వ్యవహారంపై ఫ్యాక్ట్ చెక్ చేసి ఆ వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అలాంటి వార్తలను గుడ్డిగా నమ్మి ఇతరులకు షేర్ చేయకూ...

February 21, 2023 / 09:33 PM IST

Elephant attacks: ఏనుగుల దాడిలో 3 రోజుల్లో 10 మంది మృతి

జార్ఖండ్‌ రాంచీ జిల్లాలోని పలు గ్రామాల్లో ఏనుగుల దాడులతో మూడు రోజుల్లో 10 మంది మరణించారు. ఈ క్రమంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అక్కడి అధికారులు సూచించారు.

February 21, 2023 / 08:43 PM IST

Vande Bharat Trains: తమ ప్రాంతానికి కావాలని 60 మంది ఎంపీల లేఖ

దేశంలో ఇటీవల ప్రారంభమైన వందేభారత్ రైళ్లకు క్రమంగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రారంభం కాగా...60 మంది ఎంపీలు తమ నియోజకవర్గాలకు కూడా ఈ ట్రైన్స్ కావాలని రైల్వే శాఖకు లేఖలు రాశారు. కోరిన వారిలో బీజేపీకి చెందిన వారు ఎక్కువగా ఉండగా, విపక్ష ఎంపీలు 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

February 21, 2023 / 07:26 PM IST

Viral Video: అమ్మాయిలతో కలిసి డాన్స్ చేసిన ప్రొఫెసర్లు…షారుఖ్ ఖాన్ రియాక్ట్

పఠాన్ మూవీలో ఓ పాఠకు డాన్స్ చేసిన మహిళా ప్రొఫెసర్ల వైరల్ డాన్స్ వీడియోను చూసిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ చూసి రియాక్ట్ అయ్యారు. అలాంటి ఉపాధ్యాయులు, ఫ్రొఫెసర్లు దొరకడం అదృష్టమని ట్విట్టర్ వేదికగా ఆ వీడియోను జత చేస్తూ వెల్లడించారు.

February 21, 2023 / 06:51 PM IST

Social Media War: ఐపీఎస్, ఐఏఎస్ మహిళా అధికారులపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు

ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారులు గొడవకు దిగిన అంశంపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇద్దరు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారి స్థానంలో కొత్తవారిని నియమించింది. కానీ ప్రస్తుతం వీరికి ఏ శాఖలో కూడా పోస్టును కేటాయించలేదు.

February 21, 2023 / 05:56 PM IST

Bonda Uma : రాష్ట్రంలో సైకో పాలన.. బొండా ఉమ సెటైర్లు..!

Bonda Uma : రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ విమర్శల వర్షం కురిపించారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. జగన్ ప్రభుత్వం.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన ఆరోపించారు.

February 21, 2023 / 05:46 PM IST

Singer Mangli: మరో వివాదంలో సింగర్ మంగ్లీ

సింగర్ మంగ్లీ(Singer Mangli) మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవలె మహాశివరాత్రి(Maha Shiva Ratri) సందర్భంగా ఆమె ఓ పాటను రిలీజ్(Song Release) చేసింది. ప్రస్తుతం ఆ పాటే వివాదానికి దారి తీసింది.

February 21, 2023 / 05:35 PM IST

KTR: త్వరలో 8 లక్షల మందికి ఉద్యోగాలు..ఈ రంగంలోనే అవకాశాలు!

తెలంగాణలో రానున్న రోజుల్లో లైఫ్ సైన్సెస్ రంగంలో 8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే ఇదే విభాగంలో ప్రస్తుతం ఉన్న 4 లక్షల మంది ఉద్యోగాలను 2028 నాటికి రెట్టింపు చేస్తామని వెల్లడించారు.

February 21, 2023 / 05:15 PM IST

Lokesh Padayatra : 300 కిలోమీటర్లు దాటిన లోకేష్ పాదయాత్ర..!

Lokesh Padayatra : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర దిగ్విజయం గా కొనసాగుతోంది. యువగళం పేరిట ఆయన చేపట్టిన యాత్ర 300 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. దీంతో... తొండమానుపురంర గ్రామంలో లోకేష్ ఈ సందర్భంగా శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.

February 21, 2023 / 04:49 PM IST

Viral Video: చిరుతను ఎదిరించి పిల్లలను రక్షించుకున్న పోర్కుపైన్లు

సాధారణంగా పిల్లలను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ఏం చేసేందుకైనా సిద్ధపడతారు. అది మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా అంతకు మించి ఉందని నిరూపించాయి. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. పోర్కుపైన్ జాతికి చెందిన పిల్లలను ఓ చిరుత వేటాడేందుకు రాగా..వాటి పేరెంట్స్ అడ్డుగా నిలిచి చిరుతపై పోరాడి పిల్లలను కాపాడుకున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

February 21, 2023 / 04:00 PM IST

Delhi:లో ఓలా, ఉబర్ బైక్ ట్యాక్సీలపై నిషేధం..ఇప్పటికే మహారాష్ట్రలో

ఢిల్లీలో బైక్ ట్యాక్సీలపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఢిల్లీ రవాణా శాఖ నోటీసులో స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఓలా, ఉబర్, రాపిడో రైడర్స్ వంటి సర్వీస్ ప్రొవైడర్లు ఢిల్లీలో బైక్ ట్యాక్సీ సేవలను కొనసాగిస్తే జరిమానా విధించబడుతుందని వెల్లడించింది.

February 21, 2023 / 03:03 PM IST

World Book of Records:లో చోటు దక్కించుకున్న రెండేళ్ల బుడ్డోడు తన్మయ్

అమృత్‌సర్‌కు చెందిన రెండేళ్ల తన్మయ్ 195 దేశాల జెండాలను గుర్తించడం ద్వారా వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించాడని అతని తల్లి హీనా నారంగ్ తెలిపారు. ఇంత చిన్న వయస్సులోనే తన్మయ్ అరుదైన ఘనతను సాధించడం పట్ల బాబు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ బాబు తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు భగవద్గీతను ఎక్కువగా విన్నానని వెల్లడించింది.

February 21, 2023 / 02:40 PM IST

Ramdev baba : అంబానీ పై రాందేవ్ బాబా షాకింగ్ కామెంట్స్…!

Ramdev baba : అంబానీ పై రాందేవ్ బాబా షాకింగ్ కామెంట్స్ చేశారు. రూ.వేల కోట్లకు అధిపతులైన వ్యాపారవేత్తల కంటే నాసమయం ఎంతో విలువైనదని అన్నారు..బాబా రామ్ దేవ్. వ్యాపారవేత్తల సమయాన్ని డబ్బుతో లెక్కిస్తారని వారికి డబ్బు తప్ప మరోధ్యాస ఉండదనే పరోక్షంగా ఈ వాఖ్యలు చేశారు.

February 21, 2023 / 02:34 PM IST

Farewell: సీఎం జగన్ వీడ్కోలు.. భావోద్వేగానికి లోనైన గవర్నర్ బిశ్వభూషణ్

గవర్నర్ కు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో గవర్నర్ మూడున్నరేళ్ల కాలాన్ని ఒకసారి నెమరు వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇకపై తనకు రెండో ఇల్లు లాంటిదని పేర్కొన్నారు.

February 21, 2023 / 01:40 PM IST