వివిధ కంపెనీల్లో ఉద్యోగాల కోత (layoffs) కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం మెకెన్సీ (McKinsey) 2000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. తమ క్లయింట్స్ తో నేరుగా సంబంధాలు ఉండని సహాయక సిబ్బందిని తొలగించే యోచనలో మెకెన్సీ ఉందని వార్తలు వస్తున్నాయి.
సంఘటనపై తాజాగా యాంకర్ (Anchor), హీరోయిన్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) స్పందించింది. చిన్నారి మృతిపై అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక కుక్కల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఈ సందర్భంగా రష్మీ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. బాలుడి మృతి ఆమెను కలచి వేసింది.
ప్రముఖ శాండిల్ వుడ్ నటుడు (sandalwood), మాజీ మంత్రి అనంత్ నాగ్ (Ananth Nag) ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. కర్నాటక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు నలిన్ కటీల్ ఆధ్వర్యంలో సాయంత్రం నాలుగున్నర గంటలకు పార్టీ కార్యాలయంలో కమల తీర్థం పుచ్చుకోనున్నారు.
విషయం తెలుసుకున్న ఆమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఆమె చేసిన పోస్టుకు విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, జాన్వీ కపూర్, అర్జున్ కపూర్ తదితరులు మద్దతు నిలిచారు. తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని పంచుకున్నారు. వ్యక్తిగత గోప్యత పాటించరా అని మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అసలు ఏం జరిగిందంటే..?
అందాల తార కృతి సనన్ (Kriti Sanon) 'షెహజాదా' (Shehzada) సినిమా ఈ నెల 17వ తారీఖున విడుదలైంది. రోహిత్ ధావన్ (Rohit Dhawan) దర్శకత్వంలో ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ కు జోడీగా నటించింది కృతి. ఈ సినిమాలో హీరోయిన్ నటనకు గాను నటుడు శ్రేయాస్ తల్పడే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రశంసల వర్షం కురిసింది. దీనికి కృతి థ్యాంక్స్ చెప్పింది. అయితే అది తన ట్విట్టర్ ఖాతా కాదంటూ.. కృతికి సారీ చెప్పారు శ్రేయాస్. ఈ సంఘట...
అధికారులు వాస్తవ పరిస్థితిని తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రకటించింది. కాగా రెండు రోజుల వ్యవధిలో ఎయిర్ ఇండియాకు చెందిన రెండు విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఆ విమానం కూడా అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఢిల్లీ మేయర్ ఎన్నిక (Delhi Mayor Election) ఈ రోజు (బుధవారం, ఫిబ్రవరి 22) జరగనుంది. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 2022 డిసెంబర్ 7న ప్రకటించిన ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి 104 (bharatiya janata party), ఆమ్ ఆద్మీ పార్టీకి (Aam Admi party) 134, కాంగ్రెస్ పార్టీకి (Congress) 9 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే.
జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ ఏనుగు (jharkhand elephant attack) అయిదు జిల్లాల్లో గ్రామస్థులను భయాందోళనకు గురి చేస్తోన్న విషయం తెలిసిందే. ఏనుగు కేవలం 12 రోజుల్లో 16 మందిని పొట్టన పెడ్డుకున్నది. ఇందులో ఒక రాంచీ జిల్లాలోనే నలుగురిని చంపేసింది.
అత్యాధునిక సౌకర్యాలతో పాటు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల బాట పడుతున్నారు. అరుదైన వ్యాధులకు చికిత్సలు అందిస్తూ సర్కార్ దవాఖానాలు సత్తా చాటుతున్నాయి. అరుదైన గుర్తింపును పొందుతున్నాయి. తాజాగా ఉస్మానియా ఆస్పత్రి (Osmania General Hospital-OGH) మరో ఘనతను సాధించింది. ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani)కి విద...
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)... పోలీసులు (police) అరెస్ట్ చేసిన పట్టాభి (Pattabhi) కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి భార్య చందన (Chandana), పిల్లలతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు.
భారత ఐటీ దిగ్గజం విప్రో (Wipro) తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కొత్త వారికి (fresh recruiters) వార్షిక వేతనం రూ.6.5 లక్షలు ఆఫర్ చేసిన ఈ సాఫ్టువేర్ దిగ్గజం... ఆ తర్వాత దానిని దాదాపు సగానికి కోత విధించాలని నిర్ణయించుకుంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే, 30 సంవత్సరాలు ప్రజా సేవలో ఉన్న వ్యక్తిని గౌరవించుకోలేని దౌర్భాగ్యం పట్టిందని సాయన్న అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ దళితులపై చిన్నచూపు చూస్తున్నాడని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. దళిత సీఎం మాట తప్పినప్పటి నుంచే దళితులపై కేసీఆర్ కు ప్రేమ లేదని రుజువైందని చెప్పారు. రాజకీయాలు పక్కనపెడితే సాయన్న వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరిలో అసంతృప్త...
తాను విశాఖ లోకసభ స్థానం (vishaka lok sabha) నుండి తాను స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని సీబీఐ (CBI) మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ (VV Lakshminarayana) మరోసారి స్పష్టం చేశారు.
భారత్ జోడో యాత్ర పేరిట రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుదీర్ఘ యాత్ర చేపట్టాడు. నిస్తేజంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపాడు. సోనియా గాంధీ ఇటలీ దేశస్తురాలు. సోనియా తల్లి పావ్ లామాయినో ఇంకా జీవించి ఉన్నారు. అందుకే అప్పుడప్పుడు రాహుల్ ఇటలీకి వెళ్తుంటాడు.
గన్నవరంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడి, తదనంతర పరిణామాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి, పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగం ఆరోపణలు ప్రతిపక్ష పార్టీకి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. పోలీసులు ఎట్టకేలకు పట్టాభిని మంగళవారం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపించారు పట్టాభి.