IND vs AUS: భారీ స్కోర్ చేసిన ఆస్ట్రేలియా..6 వికెట్లు తీసిన అశ్విన్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్(IND vs AUS) మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టు(Test)లో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్ అయిన ఉస్మాన్ ఖవాజా 180 పరుగులు చేశాడు. అలాగే ఆసీస్ ఆల్ రౌండర్ అయినా కామెరాన్ గ్రీన్ 114 పరుగులు చేశాడు. వీరిద్దరి భారీ స్కోరు వల్ల ఆస్ట్రేలియా జట్టు 480 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

మ్యాచ్ చివరిలో ఆస్ట్రేలియా(Australia) ఆటగాళ్లు టెయిలెండర్లు టాడ్ మర్ఫీ 41 పరుగులు, నాథన్ లైయన్ 34 పరుగులు చేశారు. భారత బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేశారు. అశ్విన్(Ashwin) ఈ ఇన్నింగ్స్ లో రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్ లో అశ్విన్(Ashwin) మొత్తం 6 వికెట్లను పడగొట్టాడు. భారత బౌలర్లు మహ్మద్ షమీ 2, జడేజా 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీసి ఆసీస్ బ్యాటర్లను ఆలౌట్ చేశారు.
ఆస్ట్రేలియా జట్టు లోయర్ ఆర్డర్ మొత్తం కూడా అశ్విన్(Ashwin) ఖాతాలోనే ఔట్ అవ్వడం విశేషం. ఇకపోతే రెండో రోజు ఆట చివరి సెషన్ లో టీమిండియా(Team India) తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. టీమిండియా 5 ఓవర్లకు ఒక్క వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్ 10, టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) 8 పరుగులతో కొనసాగుతున్నారు.