కొన్ని రోజుల్లోనే మిగతా డబ్బు కూడా సర్దుబాటు అయ్యేలా ఉంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఎందరో మహానుభావులు స్పందించి నిర్వాణ్ కు పునర్జన్మ కల్పిస్తున్నారు. త్వరలోనే నిర్వాణ్ కు వైద్యం అందించనున్నారు. మనుషుల్లో మానవత్వం దాగి ఉందని ఇలాంటి సంఘటనలు చూస్తే తెలుస్తున్నది.
తమకు అన్నీ తెలుసునని భావించే బీజేపీ ఎవరినీ గౌరవించని ‘క్లాస్ రౌడీ’ లాంటిదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. మరోవైపు మేఘాలయ షిల్లాంగ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న క్రమంలో రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అయితే బీజేపీని గెలిపించేందుకే టీఎంసీ పోటీ చేస్తుందని ఎద్దేవా చేశారు.
సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం రణ్‌బీర్ కపూర్ ఒప్పకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలో కోల్‌కతాలో ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని నెట్టింట ఈ వార్త హల్ చల్ చేస్తుంది.
చైనాలోని మంగోలియా ప్రాంతంలో ఓ ఒపెన్ కాస్ట్ మైన్ కూప్పకూలడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో 50 మంది గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న అధికారులు గనిలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు.
KL రాహుల్ ఫామ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో భారత జట్టు నుంచి ఓపెనర్ రాహుల్ ను తప్పించాలా అనే ప్రశ్నకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చాట్ జీపీటీ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది. అదేంటో ఇక్కడ చుద్దాం.
వ్యాపారవేత్త నటాషా పూనావాలా 'క్యాండీ డ్రెస్' పై పలువురు సెలబ్రేటీలు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పిప్పర్ మెంట్ డ్రెస్ అదిరిందని అంటున్నారు. అయితే నటాషా ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ స్థానిక తయారీదారు అయిన సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) CEO అదార్ పూనావలా భార్య. నటాషా తరచుగా నటులు కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, కరిష్మా కపూర్, సోనమ్ కపూర్ సహా పలువురు ప్రముఖులతో ఎక్కువగా కనిపిస్...
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం పెద్ద ఎత్తున నష్టాలతో చవిచూశాయి. BSE సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లకుపైగా నష్టపోగా, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీ 273, బ్యాంక్ నిఫ్టీ 700 పాయింట్లకుపైగా దిగువకు పయనించాయి. దీంతో ఒక్కరోజే సమారు 3.5 లక్షల కోట్ల సంపదను మదుపర్లు కోల్పోయారు.
గత ఏడాది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధికంగా విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ మూడు విఫల ప్రయత్నాల తర్వాత ఈరోజు తన మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్ 34 ఓట్ల తేడాతో గెలుపొందారు. మేయర్ ఎన్నికలో నామినేటెడ్ సభ్యులకు ఓటు వేయాలనే నిర్ణయంపై ఆప్, బీజేపీ సభ్యులు వాగ్వాదానికి దిగడంతో గతంలో మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశాలు వాయిదా పడ్డాయి.
హీరో అల్లరి నరేష్ నటించిన ఉగ్రం మూవీ టీజర్ రిలీజైంది. టీజర్లో నరేష్ యాక్టింగ్, ఫైట్స్ సహా పలు సీన్లు సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. నాంది ఫేం డైరెక్టర్ విజయ్ కనకమేడల, నరేష్ కాంబోలో వచ్చిన రెండో చిత్రం ఇది. ఇప్పటికే నాంది బంపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.
దేశ రాజధాని ఢిల్లీ ఈ రోజు మధ్యాహ్నం భూ ప్రకంపనాలతో వణికింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. నేపాల్‌లో గల జుమ్లాకు 69 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 1.30 గంటలకు భూమి కంపించగా.. దాని తీవ్రత 10 కిలోమీటర్ల లోతు వరకు ఉందని సిస్మలాజిస్టులు తెలిపారు.
తమిళ నటుడు ప్రభు అనారోగ్యానికి గురయ్యారు. ఆకస్మాత్తుగా తనకు కిడ్నీలో రాళ్ల నొప్పి రావడంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ప్రభు బాగానే ఉన్నాడని.. త్వరలోనే డిశ్చార్జ్ అవుతాడని వైద్యులు ప్రకటించారు.
sharmila on hijras:హిజ్రాలకు (hijras) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (sharmila) బేషరతుగా క్షమాపణలు చెప్పారు. హిజ్రాలను కించపరిచే ఉద్దేశం తమకు లేదన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ (shankar naik) తనను అవమానిస్తే తిప్పికొట్టే ప్రయత్నం చేశానని వివరించారు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి ప్రకటించారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన రామస్వామి ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను కూడా బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిక్కీ హేలీ బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు.
కరోనా సమయంలో మీరు అందించిన సహకారం, మద్దతు మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. 44 నెలల పాటు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పట్ల తనకు ఎప్పటికీ అభిమానం ఉంటుందని పేర్కొన్నారు.
గృహనాథన్, తస్కర లహల, ఎల్సమ్మ ఎన్న ఆన్ కుట్టీ, హ్యాపీ హస్బెండ్స్, కనకసింహాసనం తదితర సినిమాల్లో సుభి నటించింది. ఇలా దాదాపు 20 సినిమాల్లో నటించింది. అతి చిన్న వయసులోనే ఆమె మృతి చెందడం కలచి వేస్తోంది. ఆమె అభిమానులు, ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఆమెకు సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.