»Ap Jac Leader Bopparaju Venkateswarlu Pending Bills Should Be Given Otherwise We Will Continue Our Protest Till April 5
AP JAC: పెండింగ్ బిల్లులు ఇవ్వాలి..లేదంటే ఏప్రిల్ 5 వరకు నిరసన కొనసాగిస్తాం
ఏపీ ప్రభుత్వం(ap government) 11వ పీఆర్సీ హామీలతోపాటు పెండింగ్ బిల్లులు, బకాయిలు సహా అనేక సమస్యలను నెరవేర్చలేదని ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు(bopparaju venkateswarlu) అన్నారు. ఈ క్రమంలో తన నిరసనను ఏప్రిల్ 5 వరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
ఏపీ ప్రభుత్వం(ap government) ఉద్యోగులకు ఇవ్వాల్సిన 11వ పీఆర్సీ హామీలతోపాటు పెండింగ్ బిల్లులు, బకాయిలు సహా అనేక సమస్యలను నెరవేర్చలేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు(bopparaju venkateswarlu )పేర్కొన్నారు. చర్చలకు పిలిచినప్పటికీ వీటిపై చర్చించకుండా దాటవేశారని తెలిపారు. మరోవైపు మా ఉద్యోగుల డబ్బులను వాడుకున్న ప్రభుత్వం వాటినే ఇస్తామని చెప్పారు తప్ప మిగతా హామీల గురించి పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో మార్చి నెలలోపు పీఆర్సీ బకాయిలు, డీఏ, భత్యాలకు సంబంధించిన కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల(employees) డిమాండ్లపై ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక హామీలో స్పష్టత లేదని పేర్కొంటూ ఏపీ జేఏసీ అమరావతి ఆందోళనకు దిగాలని నిర్ణయించింది. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఉదాసీన వైఖరి కారణంగానే ఉద్యోగులు ఆందోళనకు దిగాల్సి వచ్చిందని సీఎస్(CS)కు సమర్పించిన నోటీసులో పేర్కొన్నారు.
మరోవైపు ఏప్రిల్ 5 వరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు(Black badges)ధరించి విధులకు హాజరై నిరసనను కొనసాగిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు(bopparaju venkateswarlu ) స్పష్టం చేశారు. ఉద్యమ కార్యచరణలో ప్రతి ఉద్యోగి పాల్గొనాలని కోరారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని సూచించారు. ఇంకోవైపు ఎక్కడా కూడా ఉద్యోగులను రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం ప్రయత్నించవద్దని కోరారు. ఏపీ ప్రభుత్వ చర్చల ద్వారా ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఈ క్రమంలో తమ ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ నెల 17, 20 తేదీల్లో ఏపీ జేఏసీ(AP JAC) అమరావతి నేతలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి ఉద్యోగుల ఆందోళనకు మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లు తెలిపారు. మార్చి 27 నుంచి కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి ఇళ్లను సందర్శించనున్నట్లు చెప్పారు.
దీంతోపాటు పాత ఫించన్ విధానం, కాంట్రాక్టు ఉద్యోగుల(employees) క్రమబద్దీకరణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు కూడా పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో పెండింగ్ లో ఉన్న బకాయిలు, బిల్లులతోపాటు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఇదే విధానంలో కొనసాగిస్తామని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.