Ramdev baba : అంబానీ పై రాందేవ్ బాబా షాకింగ్ కామెంట్స్ చేశారు. రూ.వేల కోట్లకు అధిపతులైన వ్యాపారవేత్తల కంటే నాసమయం ఎంతో విలువైనదని అన్నారు..బాబా రామ్ దేవ్. వ్యాపారవేత్తల సమయాన్ని డబ్బుతో లెక్కిస్తారని వారికి డబ్బు తప్ప మరోధ్యాస ఉండదనే పరోక్షంగా ఈ వాఖ్యలు చేశారు.
గవర్నర్ కు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో గవర్నర్ మూడున్నరేళ్ల కాలాన్ని ఒకసారి నెమరు వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇకపై తనకు రెండో ఇల్లు లాంటిదని పేర్కొన్నారు.
భారత చలన చిత్ర పరిశ్రమలో దాదా సాహెబ్ పాల్కేను ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) సోమవారం రాత్రి ముంబైలో అట్టహాసంగా జరిగింది. 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన ట్రిపుల్ అర్, కాంతార సినిమాలు అవార్డు దక్కించుకున్నాయి. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమా ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను సొంతం చేసుకున్నది. కలెక్షన్స్ సునామీ సృష్టించిన కాంతారా సినిమాలో నటనకు గాను ...
ys sharmila:బీఆర్ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలపై వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు. అత్యాచారాల్లో తెలంగాణ రాష్ట్రం ముందు ఉందన్నారు. మద్యం అమ్మకాలు, డ్రగ్స్ విచ్చల విడిగా అమ్ముతున్నారని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు మాత్రం కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యవహారంలో వాస్తవమే కౌశిక్ రెడ్డి మాట్లాడాడని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహిళా కమిషన్ తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించదని ప్రశ్నిస్తున్నారు.
Jr. NTR : ఏ ముహూర్తాన ఎన్టీఆర్, కొరటాల శివ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారో గానీ.. సెట్స్ పైకి మాత్రం వెళ్లడం లేదు. ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్', కొరటాల శివ 'ఆచార్య' సెట్స్ పై ఉన్నప్పుడే ఎన్టీఆర్ 30 ప్రకటించారు. అయితే ఆచార్య ఫ్లాప్ అవడంతో.. కొరటాల కోలుకోవడానికి కాస్త సమయం పట్టింది.
Breaking News : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రలో కలకలం రేగింది. హనుమకొండలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.
నేర చరిత్ర ఉన్నవారితో పాటు అనుమానితులను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. గతేడాది అక్టోబర్ లో ఎన్ఐఏ 5 రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో కూడా ఇదే రీతిన దాడులు చేపట్టింది. నాడు లభించిన ఆధారాల ఆధారంగా తాజా దాడులు జరిగాయి.
Breaking News : టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. ఇటీవల టర్కీ లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి 40వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కోట్లలో ఆస్తి నష్టం కలిగింది.
Rajamouli - Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ కోసం యావత్ సినీ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఖచ్చితంగా చెప్పలేకపోయినా.. రూమార్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారు (Sportsmen)లకు పెద్ద పీట వేస్తోంది. ఇటీవల భారత షూటర్ ఇషాసింగ్ (Esha Singh) కు కూడా స్థలం పత్రాలను ఇచ్చారు. గతంలోనూ సానియా మీర్జా, పీవీ సింధు తదితరులకు తెలంగాణ ప్రభుత్వం భారీ నగదు బహుమతితో పాటు ఉద్యోగాలను ప్రకటించింది. ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఈ మేరకు క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నది.
Ram Charan : ఈసారి ఆస్కార్ నామినేషన్లో ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్ సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట.. గోల్డేన్ గ్లోబ్ అవార్డ్ సైతం దక్కించుకుంది.
Malladi Vishnu : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకి పిచ్చి పట్టిందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ ని వీడుతూ సోము పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఆ కామెంట్స్ దెబ్బకు సోము కి పిచ్చి పట్టిందని... ఏం మాట్లాడున్నాడో కూడా తెలియడం లేదంటూ ఆయన విమర్శించడం గమనార్హం.
YS Bharathi : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి... ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా..? వచ్చే ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా..? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే... అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది.
ఒక్క తెలుగు సినిమానే కాదు తమిళ్, కన్నడ, హిందీ సినిమాలకు ఎడిటర్ గా కృష్ణారావు పని చేశారు. తెలుగులో దిగ్గజ దర్శకులు దాసరి నారాయణ రావు, కె. విశ్వనాథ్, కె.రాఘవేంద్ర రావు, బాపు, జంధ్యాల వంటి వారి సినిమాలకు కృష్ణారావు ఎడిటర్ గా పని చేశారు.