»Sudha Murthys Pongala Offering Goes Viral For Its Simplicity
Sudha Murthy: ఓ ప్రధాని అత్త, 35వేల కోట్ల ధనవంతురాలు, కట్టెలపొయ్యిపై పొంగల్
ప్రసిద్ధ పొంగల్ పండుగలో... 35,000 కోట్ల అధిపతి అయిన సుధామూర్తి కూడా ఓ సాధారణ గృహిణిలా భక్తిభావంతో పాలు పంచుకున్నారు. ఇప్పుడు ఈమెకు సంబంధించిన వీడియో, ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
కేరళ రాష్ట్రంలోని (Kerala state) తిరువనంతపురం ( Thiruvananthapuram)లోని అట్టుకల్ భగవతి దేవాలయంలో (Attukal Bhagavathy Temple) మార్చి 7వ తేదీన మంగళవారం జరిగిన ప్రసిద్ధ పొంగల్ పండుగకు (Pongala festival) వేలాది మంది మహిళలు (Women) తరలి వచ్చారు. ఇక్కడ ప్రతి ఏడాది పది రోజుల పాటు జరిగే పండుగలో భాగంగా తొమ్మిదో రోజున వేలాది మంది మహిళా భక్తులు అట్టుకల్ పొంగల్ కు (Attukal Pongal) తరలి వచ్చారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరిగిన ఈ పవిత్ర ఉత్సవం కోసం వందలాది మంది అర్చకులను నియమించారు. తిరువనంతపురం అంతా పండుగ వాతావరణం నెలకొన్నది. ఉదయం పదిన్నర గంటలకు వేలాది మంది మహిళలు అట్టుకల్ భగవతి ఆలయంలో (Attukal Bhagavathy Temple) పొయ్యి వెలిగించడంతో ప్రారంభమవుతుంది. మహిళలు అందరూ ఈ కార్యక్రమానికి ఓ చోటుకు రావడం ప్రపంచంలోనే అతిపెద్దదిగా చెబుతారు. మహిళలు నగరమంతా రోడ్ల పైన, ఆలయం చుట్టూ పొయ్యిలను ఏర్పాటు చేస్తారు. పొయ్యి పైన లోహం లేదా మట్టి పాత్రను పెట్టి, బియ్యం, బెల్లం, కొబ్బరి, యాలకుల తదితర మిశ్రమాలతో ఖీర్/పాయసం సిద్ధం చేస్తారు. మహిళలు అందరూ రోడ్లపై, దేవాలయం చుట్టూ కూర్చొని పొయ్యి అంటించి, ఈ ప్రసాదం సిద్ధం చేస్తారు.
ఈ ప్రసిద్ధ పొంగల్ పండుగలో… 35,000 కోట్ల అధిపతి అయిన సుధామూర్తి (Sudha Murthy) కూడా ఓ సాధారణ గృహిణిలా భక్తిభావంతో పాలు పంచుకున్నారు. ఇప్పుడు ఈమెకు సంబంధించిన వీడియో, ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. పద్మభూషణ్ సుధామూర్తి (Padma Bhushan Sudha Murthy)… ఇన్ఫోసిస్ నారాయణమూర్తి (Infosys founder N. R. Narayana Murthy) సతీమణి. ఆమె 35వేల కోట్ల అధిపతి. పైగా, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ (britain prime minister Rishi Sunak) అత్త. ఇలాంటి సుధామూర్తి సాధారణ మహిళ వలె పండుగ సందర్భంగా మండుతున్న కట్టెల పొయ్యిపై నైవేద్యం వండుతూ కనిపించిన ఫోటో అందరినీ ఆకర్షిస్తోంది. మూడు ఇటుకలను పొయ్యిలా పెట్టి, అందులో కర్రలు ఉంచి, గిన్నెలో ఖీర్ తయారు చేస్తూ, చేతిలో అరటి ఆకు పట్టుకున్న ఫోటో ఇది. అమె చుట్టూ ఉన్న అందరూ కూడా సాధారణ మహిళలే. ఆమె పండుగ సందర్భంగా ప్రత్యేకంగా వీఐపీ గుర్తింపు కోరుకోలేదు. అందరి మహిళల్లా పొంగల్ లో పాల్గొనడంతో సాధారణ మహిళలు చాలామంది ఆమెను గుర్తించలేకపోయారు.
ఈ ఫోటోను భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata party) సెంట్రల్ బెంగుళూరు పార్లమెంటు సభ్యులు పీసీ మోహన్ (Bengaluru Central MP PM Mohan) ట్వీట్ చేశారు. ‘ఆమె 35,000,00,00,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ నికర సంపన్న కుటుంబం నుండి వచ్చింది. ఆమె అల్లుడు ఓ దేశానికి ప్రధానమంత్రి. ఆమె ఎన్నో ఘనతలు సాధించిన మహిళ. ఇలాంటి మహిళ భారతీయ సంప్రదాయంలో ముందు నిలిచారు. ఆమె పద్మభూషణ్ సుధామూర్తి’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పైన సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.