బాలీవుడ్ నటులు ఇమ్రాన్ హష్మీ, అక్షయ్ కుమార్ తో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డాన్స్ చేస్తూ సందడి చేసింది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
మహిళల టీ20 వరల్డ్ కప్ నేడు టీమిండియా(Team India) కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా(Team India) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఫిబ్రవరి 22న అమృత్‌సర్‌లోని గురుదాస్‌పూర్‌లో 'రైల్ రోకో' నిరసనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది రైతులు పాల్గొననున్నట్లు ప్రకటించింది. భారతమాల యోజన కింద హైవే నిర్మాణం కోసం సేకరించిన భూమికి సమానమైన పరిహారం చెల్లించడం, చెరకు బకాయిలు, ఢిల్లీ ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుబాలకు పరిహారం, ఉద్యోగాలు సహా పలు అంశాలపై రైతులు నిరసన చేపట్టనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అధికారులు దూకుడు పెంచారనే చెప్పవచ్చు. దర్యాప్తును వేగవంతం చేస్తూ క్రమంగా పలువురిని అరెస్ట్ చేసి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అరెస్టైన ఏపీ వైఎస్సార్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని తీహార్ జైలుకు తీసుకెళ్లారు. రాఘవకు విధించిన కస్టడీ గడువు ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
మంచి బాడీ షేప్స్, కండలు తిరిగిన మజిల్స్, సిక్స్ ప్యాక్ కోసం యువకులు ఎక్కువగా జిమ్ సప్లిమెంట్లను వాడుతూ ఉంటారు. అయితే వీటి వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు. ఇటీవల ఢిల్లీలో ఓ 22 ఏళ్ల యువకుడు దీర్ఘకాలంగా జిమ్ సప్లిమెంట్స్ వాడుతూ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స చేయించుకున్నాడు.
Prabhas : ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ పై ఎంతలా ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. టీజర్‌లోని గ్రాఫిక్స్ యానిమేషన్‌లా ఉన్నాయని తేల్చేశారు జనాలు.
కర్ణాటకలో ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారుల మధ్య లొల్లి అక్కడి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. IAS అధికారిణి రోహిణి సింధూరి వ్యక్తిగత ఫోటోలను.. IPS అధికారిణి డీ రూప మౌద్గిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు లొల్లి మొదలైంది. వీరి గొడవ ఎంటో తెలుసుకోవాలంటే కింది వార్తను చదివాల్సిందే.
30 Years Prudhvi : సినీ నటుడు తారకరత్న తుదిశ్వాస విడిచారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన ఆయన గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. 23 రోజులు వెంటిలేటర్ పై చికిత్స పొందిన ఆయన శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతి పై అందరూ విచారం వ్యక్తం చేశారు.
కాలేజ్ అమ్మాయిలు డాన్స్ చేస్తుంటే మధ్యలో మహిళా ప్రొఫెసర్లు కూడా వచ్చి జాయిన్ అయితే ఎలా ఉంటుంది. క్రేజీ కాదా. అవును. ఈ వీడియోలో అదే జరిగింది. ఢిల్లీలోని జీసెస్ & మేరీ కాలేజ్ విద్యార్థినులు ఫ్లాష్ మాబ్ చేస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Viral News : పులిని వేటాడం గురించి విని ఉంటారు. కానీ... పులిని చంపి.. దానిని వండుకొని తినడం గురించి ఎప్పుడైనా విన్నారా..? అసలు ఎవరైనా తింటారా అని ఆశ్చర్యపోకండి. నిజంగానే తిన్నారు. ప్రకాశం జిల్లా అక్కపాలెంలో ఈ సంఘటన చోటుచేసుకోగా.... ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, మరో 60 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.
హైదరాబాద్(Hyderabad) లో వేసవి తాపం ప్రారంభమైంది. ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ వారం ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెడతాం లోన్ కావాలని తెలంగాణ ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసిందన్నారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెడతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. మరోవైపు సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం వాటా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రైవేటు పరం చేస్తుందని నిలదీశారు.
Crime : తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ 47ఏళ్ల వ్యక్తి 16 ఏళ్ల మైనర్ బాలికను బెదిరించాడు. ఆమె అంగీకరించలేదని.. మెడపై కత్తి పెట్టి... జుట్టుపట్టుకొని లాక్కెళ్లాడు. ఈ అమానుష ఘటన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ లో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు.
Chiru-Balaiya : మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ మధ్య పోటీ కొత్త కాకపోయినా.. ఇద్దరు పోటీ పడితే ఫ్యాన్స్‌కు భలే కిక్ వస్తుంది.