»Uttarakhand Men Lawyer Nose Bite On Women Lawyer For Refused His Love
Lawyer Nose Bite ప్రేమించలేదని ప్రేయసి ముక్కు కొరికిన ప్రియుడు
ఆమె నిరాకరించడంతో తీవ్ర కోపంతో ఆమెపై దాడి చేశాడు. వెంటనే ఆమె ముక్కు కొరికేశాడు. ఈ సంఘటనతో స్థానికంగా ఉన్న వారు ఏం జరిగిందో గుమిగూడారు. అనంతరం చంద్రశేఖర్ అక్కడి నుండి పారిపోయాడు.
ప్రేమ అనేది ఎవరిపై ఎప్పుడూ పుడుతుందో తెలియదు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తే వారి బంధం సవ్యంగా సాగుతుంది. ఒకరిపై ప్రేమ పుట్టి మరొకరిలో పుట్టకపోతేనే అసలు సమస్య. తమను ప్రేమించాలని ఒత్తిడి పెరుగుతుంది. తమను ప్రేమించేదాకా విసిగిస్తారు. ఈ క్రమంలోనే దాడులు జరుగుతాయి. యాసిడ్ పోయడం.. కత్తులతో దాడికి పాల్పడడం.. లైంగికంగా వేధించడం.. హత్యలకు పాల్పడడం వంటివి సంఘటనలు ఆ కారణంగానే జరుగుతున్నాయి. అయితే ఓ ప్రియుడు (Lover) మాత్రం తనను ప్రేమించడం లేదని తన ప్రేయసి ముక్కు (Nose Bite) కొరికేశాడు. అది కూడా న్యాయస్థానం (Court) ఆవరణలో దాడికి పాల్పడడం సంచలనంగా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రం హరిద్వార్ (Haridwar) ప్రాంతంలో ఉన్న రోషనాబాద్ కోర్టు (Roshnabad Court)లో న్యాయవాది (Lawyer) చంద్రశేఖర్ (Chandrasekhar). అతడి వద్ద అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి 2018లో ఇంటర్న్ షిప్ (Internship)గా ఉండేందుకు వచ్చింది. అతడి వద్ద న్యాయవాద వృత్తిపై శిక్షణ పొందుతూ వచ్చింది. 6 నెలల శిక్షణ ముగిసింది. దీంతో ఆమె అతడి నుంచి దూరంగా వెళ్లింది. అయితే ఆ శిక్షణ సమయంలో ఆమెపై చంద్రశేఖర్ ప్రేమ పెంచుకున్నాడు. శిక్షణ ముగిసిన అనంతరం ఆమెకు విషయం చెప్పాడు. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నా. పెళ్లి చేసుకుందాం’ అని పద్ధతిగా అడిగాడు. అతడి ప్రతిపాదనను ఆమె తిరస్కరించింది.
మనసు (Love) పారేసుకున్న అతడు ఆమెను ఎలాగైనా ఒప్పించాలని చాలా ప్రయత్నాలు చేశాడు. తనను ప్రేమించాలని కోరుతూ ఆమెపై ఒత్తిడి పెంచడం ప్రారంభించాడు. ఇద్దరు అదే కోర్టులో పని చేస్తుండడంతో కనిపించిన ప్రతిసారి తన ప్రేమ ప్రతిపాదన విషయమై చంద్రశేఖర్ ఆరా తీసేశాడు. ఆమె నో (No) అనే మాటే చెప్పేది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఏదో ఒకటి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే హోలీ పండుగ (Holi Festival) వచ్చింది. న్యాయస్థానం ఆవరణలో నిర్వహించిన హోలీ సంబరాల్లో న్యాయవాదులంతా పాల్గొన్నారు. హోలీ అనంతరం మరోసారి చంద్రఏఖర్ ఆమెతో తన ప్రేమ ప్రతిపాదన చేశాడు. ఆమె స్కూటీ (Scooty)పై వెళ్తుండగా అడ్డగించి విషయం అడిగాడు. ఆమె నిరాకరించడంతో తీవ్ర కోపంతో ఆమెపై దాడి చేశాడు. వెంటనే ఆమె ముక్కు కొరికేశాడు. ఈ సంఘటనతో స్థానికంగా ఉన్న వారు ఏం జరిగిందో గుమిగూడారు. అనంతరం చంద్రశేఖర్ అక్కడి నుండి పారిపోయాడు. ఈ ఘటనపై జ్వాలాపూర్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చంద్రశేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కోర్టులో ఈ సంఘటన జరగడంపై మహిళా న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బార్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశారు.