mlc bachula arjunudu: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మృతిచెందారు. ఈ రోజు విజయవాడ రమేశ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. గుండెపోటు రావడంతో నెలరోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈ రోజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఆయన మృతిపై టీడీపీ శ్రేణులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Vishnu Vardhan Reddy : ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని ఎదుర్కొనే సత్తా టీడీపీకి లేదు అని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి అభిప్రాయడపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తాము సత్తా చాటి తీరతామని ఆయన పేర్కొన్నారు. వైసీపీకి పోటీగా నిలిచే పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన అన్నారు.
Adimulapu Suresh : రాజధానిపై మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖ రాజధానిగా మారబోతోందంటూ ఆయన పేర్కొన్నారు. అయితే... పూర్తి స్థాయి రాజధానిగా మారుతుందా అని విలేఖరులు ప్రశ్నించగా.. ఆయన దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.
రంగారెడ్డి జిల్లా నార్సింగి శ్రీచైతన్య జూనియర్ కాలేజ్ దగ్గరకు భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లి నిరహార దీక్ష చేస్తున్నారు. సాత్విక్ ఆత్మహత్యకు కారణమైన వారిని ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Vidudala Rajini : వరంగల్ లో మెడిసిన్ చేస్తున్న ప్రీతీ అనే విద్యార్థి.. సీనియర్ విద్యార్ధి సైఫ్ వేదింపులు తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకుంది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ క్రమంలో పలు రాష్టాలు ఈ ర్యాగింగ్ పై ఉక్కుపాదం మోపేలా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. పక్క రాష్టం ఏపీలోనూ ర్యాగింగ్ పై అప్రమత్తం అయ్యారు అధికారులు.
తన కుమార్తెలు పాడిన పాట ముగిసే సమయానికి తనకు ఏడుపు వచ్చిందని హీరో మంచు విష్ణు తెలిపారు. మంచు విష్ణు, విరానికా రెడ్డి పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా తన కుమార్తెలు ఇచ్చిన వీడియో గిఫ్టును చూసి ఆశ్చర్యానికి లోనైనట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఈ బహుమతిని ఎప్పటికీ మర్చిపోలేను భావోద్వేగానికి లోనవుతూ చెప్పాడు.
తీవ్ర గాయాలవడంతో బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఏం జరిగిందని ఆరా తీయగా పిల్లాడు నోరు విప్పాడు. ఈ దారుణ ఘటన విషయమై బాలుడి తల్లిదండ్రులు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ (Mylardevpally Police Station)లో ఫిర్యాదు చేశారు. కాగా గాయాలపాలైన బాలుడిని ఆస్పత్రికి తరలించారు.
తెలుగు దేశం (Telugu Desam), జనసేన (Janasena) పార్టీలకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (anil kumar yadav) సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (andhra pradesh assembly elections 2024) జనసేనానికి పవన్ కళ్యాణ్ కు (Janasena chief Pawan Kalyan), తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)కు ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.
పెళ్లి వేడుకలకు హెలీకాప్టర్ల వినియోగం భారీగా పెరుగుతోంది. ఇతర ప్రాంతాల్లో హెలీకాప్టర్లు వధూవరులను తీసుకురావడానికి వినియోగించారు. ఇక వారిపై పూల వర్షం కురిపించేందుకు వాడారు. కానీ ఇలా పెళ్లి పిలుపుల కోసం హెలీకాప్టర్ వాడడం ఇదే మొదటిసారి కావొచ్చు. కాగా పెళ్లి కోసం హెలీకాప్టర్ వాడడం ఇదే తొలిసారి అయ్యిండొచ్చు. పెళ్లి పిలుపులకే ఇంత హడావుడి చేస్తున్న ఆ వ్యాపారి ఇక పెళ్లి నాడు ఎంత హడావుడి చేస్తున్నాడో ఊహ...
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్(Gauri Khan)పై ముంబయిలో చీటింగ్ కేసు(cheating case) నమోదైంది. ఓ వ్యక్తి తాను ప్లాట్ కోసం 86 లక్షలు చెల్లించినప్పటికీ చెప్పిన ప్రకారం ప్లాట్ అందించలేదని ఓ రియల్ ఎస్టేట్ సంస్థతోపాటు ప్రచారం చేసిన గౌరీ ఖాన్ పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాయదాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన పాదయాత్ర... చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. చంద్రగిరి నియోజకవర్గం బందార్లపల్లె గ్రామంలో స్థానికులు లోకేష్‌ని కలిశారు.
దేశంలో ప్రస్తుతం ఎక్కువ బ్యాంకులు వారానికి (Bank working days) ఐదు నుండి ఆరు రోజులు పని చేస్తున్నాయి. రెండో, నాలుగో శనివారాలు ఉన్న రోజుల్లో ఐదు రోజులు, మిగతా రెండు వారాల్లో ఆరు రోజులు పని చేస్తాయి. అయితే త్వరలో కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీజేపీకి అదానీతో సంబంధం ఉంది కానీ, ఆమ్ ఆద్మీతో సంబంధం లేదని మరోసారి రుజువైంది. బీజేపీ అంటే.. భారత జనులను పీడించే పార్టీ. గల్లి మీటింగ్ కి వచ్చే బీజేపీ నాయకులను తరిమికొట్టాలి. అన్ని సంక్షేమ పథకాలపై కోతలు పెట్టి పేదల నడ్డి విరుస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే మహిళల క్రికెట్ దశ దిశను మార్చబోతున్న మెగా టోర్నీ. 2023లోనే ఈ టోర్నీ తొలిసారి జరగబోతోంది. ఇప్పటికే మీడియా హక్కులు, ఫ్రాంఛైజీల కోసం వేసిన బిడ్లలో ఈ లీగ్ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో మహిళల ఐపీఎల్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్(WPL) మస్కట్ 'శక్తి'ని బీ...