»Indian Cricket Team Celebrate Holi In The Team Bus
Team India Holi celebrations: బస్సులోనే రంగులు జల్లుకున్న టీమిండియా
భారత జట్టు మ్యాచ్ కు సిద్ధమవుతూనే, మరోవైపు హోలీ సంబరాలు జరుపుకున్నది. విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma), సూర్య కుమార్ యాదవ్ (surya kumar yadav), శుబ్ మన్ గిల్ (Shubman Gill) తదితరులు బస్సులోనే రంగులు జల్లుకొని, సందడి చేశారు.
Indian cricket team celebrate Holi in the team bus: భారత్ – ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ కు ( IND vs AUS 4th Test) ముందు భారత క్రికెట్ జట్టు (Team India) హోలీ సంబరాల్లో తేలియాడింది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా చివరి… నాలుగో టెస్ట్ అహ్మదాబాద్ లో 9వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత జట్టు 2-1తో అస్ట్రేలియా కంటే ముందు ఉన్నది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్ట్ మ్యాచ్ చాలా కీలకం. భారత జట్టు మ్యాచ్ కు సిద్ధమవుతూనే, మరోవైపు హోలీ సంబరాలు జరుపుకున్నది. విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma), సూర్య కుమార్ యాదవ్ (surya kumar yadav), శుబ్ మన్ గిల్ (Shubman Gill) తదితరులు బస్సులోనే రంగులు జల్లుకొని, సందడి చేశారు.
గురువారం నుండి టెస్ట్ మ్యాచ నేపథ్యంలో మంగళవారం టీమిండియా సభ్యులు ప్రాక్టీస్ చేశారు. వర్క్ మోడ్ లోకి వెళ్లిన టీమిండియా బస్సు ఎక్కిన వెంటనే రంగుల్లో మునిగిపోయారు. ప్రాక్టీస్ అనంతరం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో (Narendra Modi stadium in Ahmedabad) రోహిత్ శర్మ అండ్ టీమ్ హోలీని సెలబ్రేట్ చేసుకున్నది (Rohit Sharma and Co celebrated Holi). దాదాపు టీమ్ అంతా సంబరాల్లో మునిగి తేలింది. యష్ చోప్రా సినిమా సిల్సిలాలోని ఐకానిక్ సాంగ్ రంగ్ బర్సేకు డ్యాన్స్ చేశారు. ఈ సినిమా ప్రస్తుత టీమిండియాలోని ఏ క్రికెటర్ పుట్టక ముందు విడుదలైంది. ఇప్పటికీ ఈ పాట అంటే ఎంతోమందికి క్రేజ్. కూల్.. కూల్ అంటూ కోహ్లీ మరింత ఉత్సాహం నింపారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను శుబ్ మన్ గిల్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. రోహిత్ శర్మ కూడా బస్సులో జట్టు సభ్యుల కలర్ ఫుల్ ఫోటోలను షేర్ చేశారు. సూర్య కుమార్ యాదవ్, ఛటేశ్వర పుజారా (Cheteshwar Pujara), అక్షర్ పటేల్ (Axar Patel), మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) రంగుల్లో మునిగి ఉన్న ఫోటోలను బస్సులో నుండే షేర్ చేశారు. రోహిత్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్ లు రంగులు జల్లుకున్న ఫోటోలను సూర్య కుమార్ యాదవ్ షేర్ చేశారు. విష్ యు ఎ వెరీ హ్యాపీ హోలీ అంటూ శుభాకాంక్షలు చెప్పారు. హోలీని ఉత్సాహంగా జరుపుకోండి.. సురక్షితంగా ఉండండి అంటూ సూచించారు.
కాగా, తెలుగు యువకుడు శ్రీకర్ భరత్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ లో ఆడుతున్నాడు. గత మూడు టెస్టుల్లో అతను వరుసగా 8, 6, 23 (నాటౌట్), 17, 3 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో నాలుగో టెస్టులో వేటు తప్పదనే వ్యాఖ్యలు వినిపించాయి. ఇది నిజమే అన్నట్లు ఇషాన్ కిషన్ అహ్మదాబాద్ లో సాధన చేస్తున్నాడు. భరత్ బదులు ఇషాన్ వస్తాడనే ప్రచారం నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించారు. భరత్ ప్రదర్శన పైన తమకు ఎలాంటి ఆందోళన లేదని, సవాళ్లు, పరిస్థితులను అతను అర్థం చేసుకొని, ఆడే ప్రయత్నం చేస్తాడని, మూడో టెస్టులో అంతగా రాణించనప్పటికీ, మొదటి ఇన్నింగ్స్ లో చేసిన 17 పరుగులు చాలా కీలకమని గుర్తు చేశారు. ఢిల్లీలో కూడా పాజిటివ్ గా ఆడినట్లు చెప్పారు. కఠినమైన పిచ్ ల పైన అదృష్టం కలిసి రావాలన్నారు. భరత్ కు అది కలిసి రాలేదన్నారు. అతను ఆడే విధానం బాగా ఉందని, అతని బ్యాటింగ్ పై ఆందోళన చెందకుండా మరింత దృష్టి సారిస్తామన్నారు.