»Shah Rukh Khans Staff Helped Injured Man Who Trespassed Hid In Mannat For 8 Hours
Shah Rukh Khan: షారుక్ ఖాన్ ఇంట్లోకి జొరబడ్డ ఇద్దరు యువకులు, ఎందుకంటే
తమ అభిమాన హీరోను ( Actors ) ఒక్కసారైనా కలవాలని ఎంతో మంది ఆయా హీరోల ఫ్యాన్స్ ( Hero fans ) భావిస్తారు . ఇందుకు వివిధ రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు . అయితే బాలీవుడ్ బాద్ షా ( bollywood badshah ) షారుక్ ఖాన్ ను ( shahrukh khan ) చూడాలనుకున్న ఇద్దరు ఫ్యాన్స్ మాత్రం అడ్డ దారులు తొక్కి అడ్డంగా బుక్ అయిపోయారు .
తమ అభిమాన హీరోను ( Actors ) ఒక్కసారైనా కలవాలని ఎంతో మంది ఆయా హీరోల ఫ్యాన్స్ ( Hero fans ) భావిస్తారు . ఇందుకు వివిధ రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు . అయితే బాలీవుడ్ బాద్ షా ( bollywood badshah ) షారుక్ ఖాన్ ను ( shahrukh khan ) చూడాలనుకున్న ఇద్దరు ఫ్యాన్స్ మాత్రం అడ్డ దారులు తొక్కి అడ్డంగా బుక్ అయిపోయారు . షారుక్ ఖాన్ ను ( shahrukh khan ) చూడాలనే కోరికతో వారు అత్యుత్సాహం ప్రదర్శించి , చివరకు పోలీస్ స్టేషన్ గడప తొక్క వలసి వచ్చింది . ఈ సంఘటన గత వారం చోటు చేసుకున్నది . గుజరాత్ రాష్ట్రానికి చెందిన పద్దెనిమిది ఏళ్ల పఠాన్ సాహిల్ సలీమ్ ఖాన్ , అతని స్నేహితుడు 19 ఏళ్ల రామ్ సరఫ్ కుశువ లు బాద్ షాను చూడాలని భావించారు. అనుకున్నదే తడవుగా బాలీవుడ్ హీరో నివాసం మన్నత్ లోకి ( Mannat ) జొరబడ్డారు . భద్రతా సిబ్బంది ( Security Personalsb ) కళ్లు గప్పి మరీ మార్చి 1వ తేదీన ఆర్ధరాత్రి దాటిన తర్వాత వీరు ఆ బంగ్లాలోకి ప్రవేశించారు . రాత్రి మూడు గంటలకు బిల్డింగ్ లోకి వచ్చిన వారు ఉదయం 10 . 30 నిమిషాల వరకు అక్కడే ఉన్నారు . మూడో అంతస్తులో హీరో మేకప్ గదిలో దాదాపు ఎనిమిది గంటల పాటు దాక్కున్నారు . ఉదయం వీరిని చూసి షాక్ కు గురైన షారుక్ ఖాన్ పనివారు పోలీసులకు సమాచారం అందించాడు . పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేశారు . హీరోను చూడాలనే ఉద్దేశ్యంతో వారు జొరబడినట్లుగా గుర్తించారు .
ఈ సంఘటన పైన మన్నత్ మేనేజర్ కోలీన్ డిసౌజా మాట్లాడుతూ … ఇద్దరు వ్యక్తులు భవనంలోకి ప్రవేశించిన అంశానికి సంబంధించి తనకు సెక్యూరిటీ పర్సన్స్ ఫోన్ చేశారని చెప్పాడు . ఎఫ్ఐఆర్ ప్రకారం మన్నత్ వద్ద హౌస్ కీపింగ్ సిబ్బంది సతీష్ ద్వారా వారిని గుర్తించారు . సతీష్ వారిద్దరిని మేకప్ రూం నుండి లాబీ లోకి తీసుకు వెళ్లాడని , అక్కడ అపరిచితులను చూసి షారుక్ ఆశ్చర్యపోయాడని , మన్నత్ గార్డులు వారిద్దరిని బాంద్రా పోలీసులకు అప్పగించారని తెలిపాడు . వారిలో ఒకరికి చెంప పైన చిన్న గాయం ఏర్పడిందని , వెంటనే సిబ్బంది చికిత్స చేయించినట్లు చెప్పాడు .
మన్నత్ భవనం ( Mannat Building ) లోనికి ఇద్దరు వ్యక్తులు వచ్చిన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసుకోవాలని షారుక్ ఖాన్ కు సూచించారు బాంద్రా పోలీసులు ( bandra Police ). అలాగే భవనంలో షారుక్ కు సంబంధించిన ఏవైనా వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని చెప్పారు . ఇది నటుడి సెక్యూరిటీ కోసమే చెప్పినట్లు తెలిపారు . షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా జనవరిలో విడుదలైన విషయం తెలిసిందే .