»Mlc Kavitha Diksha In Delhi Today Protest On Womens Reservation Bill
MLC Kavitha: నేడు ఢిల్లీలో దీక్ష..అసలు నిరసన ఇందుకేనా!
దేశరాజధాని ఢిల్లీ(delhi)లోని జంతర్‌మంతర్(jantar mantar) వద్ద తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(mlc kavitha) నిరసన(protest) దీక్ష చేయనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు(Womens Reservation Bill) డిమాండ్ చేస్తూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 4 వరకు దీక్ష కొనసాగించనున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల వారు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) శుక్రవారం ఢిల్లీ(Delhi)లోని జంతర్‌మంతర్ వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును(Womens Reservation Bill) చట్టసభల్లో ప్రవేశపెట్టి ఆమోదించాలనే డిమాండ్ తో భారత్ జాగృతి తరపున ఆమె ఒకరోజు దీక్ష చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. బుధవారం ఢిల్లీకి చేరుకున్న కవిత గురువారం సమావేశ కార్యక్రమాలను పరిశీలించారు. ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి ప్రయత్నించాయని వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నట్లు కవిత పేర్కొన్నారు. అంతేకాదు ఈ బిల్లును రాజ్యసభకు తీసుకురావడంలో సోనియా గాంధీ(sonia gandhi) కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)తోపాటు దాదాపు 500 మంది దీక్షలో కూర్చునే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు వేల మంది హాజరవుతారనే అంచనా మేరకు ఏర్పాట్లు చేశారు. 18 రాజకీయ పార్టీల నుంచి ప్రతినిధులు వస్తున్నారని తెలుస్తోంది. సీపీఎం(cpm) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించనున్నారు. ఈ మేరకు కవిత గురువారం ఏచూరిని కలిశారు. దీక్షకు హాజరు కావాలని మరోసారి ఆయనకు ఆహ్వానం అందింది. తెలంగాణ(telangana)కు చెందిన మంత్రులు(ministers) సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, నామా నాగేశ్వర్ రావు, కే కేశవరావు, వెంకటేష్ నేత, వావిరాజు రవిచంద్ర, సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, రేఖానాయక్ కేసీఆర్ ఆదేశాల మేరకు దీక్షలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు.
అయితే ఎమ్మెల్సీ కవిత దీక్షను అడ్డుకునేందుకు బీజేపీ(bjp) చివరి వరకు ప్రయత్నించింది. భారత్ జాగృతి జంతర్‌మంతర్‌లో(jantar mantar) సభ నిర్వహించాలని గతంలో దరఖాస్తు చేసుకోగా, పోలీసులు అనుమతి ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం అదే సమయంలో బీజేపీ దీక్ష ఉందంటూ ఆ స్థలంలో కొత్త డ్రామా మొదలైంది. మరోసారి దీక్షను మరో మైదానంలోకి వాయిదా వేయాలని, జంతర్ మంతర్ సగం స్థలాన్ని బిగించాలని, మిగిలిన స్థలాన్ని భాజపాకు ఇవ్వాలని సూచించారు. దీంతో భారత్ జాగృతి సభ్యులు పోలీసు అధికారులను సంప్రదించారు. ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు దీక్షకు అనుమతి ఇచ్చారు.