»In Hyderabad Onion Costs Wholesale Price Rs 12 Per Kg March 10th 2023
Hyderabad:లో రూ.12కే కిలో ఉల్లి…భారీగా తగ్గిన రేటు
భాగ్యనగరంలో(hyderabad) ఉల్లిపాయల(onion) ధర(rate) భారీగా తగ్గింది. క్వింటాల్ ఉల్లి ధర హోల్‌సేల్ మార్కెట్లో(wholesale market) రూ.1,200 నుంచి రూ.2000 వరకు అమ్ముతున్నారు. దీంతో కిలో ఉల్లిని రూ.12 నుంచి రూ.21 వరకు ఆన్ లైన్లో(online)విక్రయిస్తుండగా, రిటైల్, కిరాణా షాపుల్లో(retail price) ఉల్లి పరిమాణం, నాణ్యతను బట్టి కిలో రూ.16 నుంచి రూ.25 వరకు సేల్ చేస్తున్నారు.
భారతీయ వంటకాల్లో(food) ఉల్లిపాయలు(onion) లేకుండా ఏ కూర కూడా దాదాపు ఉండదనే చెప్పవచ్చు. మరికొంత మంది ప్రత్యేకంగా ఉల్లిపాయలతో కూడిన వంటకాలను కూడా తయారు చేస్తుంటారు. అంతేకాదు ఇంకొంత మంది పచ్చి ఉల్లిపాయలను తినేందుకు ఇష్టపడుతుంటే..మరికొంత మందికి మాత్రం వీటి వాసన కూడా పడదు, తినేందుకు ఇష్టపడరు. అయితే సాధారణంగా ఉల్లి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు. ఇలాంటి క్రమంలో ప్రతి కుటంబంలో ఓ అవసరంగా మారిన ఉల్లికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో(hyderabad market) ఉల్లి ధర భారీగా తగ్గింది. క్వింటాల్ ఉల్లి ధర హోల్‌సేల్ మార్కెట్లో(wholesale price) రూ.1,200 నుంచి రూ.2000 వరకు విక్రయిస్తున్నారు.
దీంతో కిలో ఉల్లి ధర ఆన్లైన్లో(online) రూ.12 నుంచి రూ.21 వరకు విక్రయిస్తుండగా, రిటైల్, కిరాణా షాపుల్లో(retail price) కేజీ ఉల్లి ధర నాణ్యతను బట్టి రూ.15 నుంచి రూ.25 వరకు పలుకుతోంది. పెళ్లిళ్ల సీజన్లో పెళ్లిళ్లు, రిసెప్షన్లు, ఇతర పార్టీల కోసం ఫుడ్(food) తయారు చేయడంలో భాగంగా భారీ మొత్తంలో ఉల్లిపాయలు వెళుతున్నాయి. ఈ క్రమంలో ఉల్లిపాయల ధరలలో పలు చోట్ల చిన్న హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి.
అయితే మహారాష్ట్రలో పెద్ద ఎత్తున పండించిన ఉల్లి పంట ధర తగ్గిన నేపథ్యంలో హైదరాబాద్‌లో(hyderabad)ఉల్లి సరఫరా పెరిగి రేట్లు తగ్గాయని వ్యాపారులు అంటున్నారు. మలక్‌పేట మార్కెట్‌తోపాటు నగరంలోని పలు మార్కెట్లు కుప్పులు కుప్పలుగా ఉన్న ఉల్లి నిల్వలతో కళకళలాడుతున్నాయి. కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 70 ట్రక్కుల ఉల్లిపాయలు ప్రతి రోజు మార్కెట్‌కు(market) వస్తున్నాయని ఓ వ్యాపారి తెలిపారు. తెలంగాణలోని నారాయణఖేడ్, తాండూరు, మహబూబ్‌నగర్ నుంచి కూడా లారీలు వస్తున్నాయని అన్నారు.
హైదరాబాద్‌లో ఉల్లిపాయల ధరలు(onion rates) తగ్గడం వల్ల హోటళ్ల వ్యాపారులు, క్యాటరింగ్‌లకు చాలా ఉపశమనం అని పలువురు చెబుతున్నారు. మరోవైపు వంటగ్యాస్ల ధరలు ఇటీవల పెరిగిన నేపథ్యంలో ఉల్లి ధరలు తగ్గడం పలువురు కస్టమర్లతోపాటు(customers) వ్యాపారులకు కూడా కొంత ఊరట కలుగుతుందని అంటున్నారు.