»This Is The Reason For Rcbs Fourth Defeat In Wpl A Row Upw Won By Rcb
UPW Won: RCBకి వరుసగా నాలుగో ఓటమి…కారణం ఇదేనంటా!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మహిళలకు కూడా పురుషులకు లభించిన అదృష్టమే దక్కినట్లు అనిపిస్తుంది. స్మృతి మంధాన నేతృత్వంలోని జట్టు 4 మ్యాచ్‌ల తర్వాత కూడా పోటీలో తమ ఖాతా తెరవలేదు. నిన్న జరిగిన మ్యాచులో కూడా ఆర్సీబీ జట్టు 10 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్(UP Warriorz) జట్టుపై ఓడిపోయింది.
శుక్రవారం జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్(WPL) మ్యాచ్‌లో యూపీ వారియర్జ్(UP Warriorz)జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) టీంను ఓడించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న RCB 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఈ జట్టులో ప్రధానంగా ఎలీస్ పెర్రీ 39 బంతుల్లో 52 పరుగులు, సోఫీ డివైన్ 36 పరుగులు చేశారు. ఇక కెప్టెన్ స్మృతి మంధాన నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యారు. ఇక తర్వాత ఛేదనకు దిగిన యూపీ వారియర్జ్(UP Warriorz) జట్టు వికెట్లు కోల్పోకుండానే 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించారు. కెప్టెన్ అలిస్సా హీలీ, దేవికా వైద్య వరుసగా 96, 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో UP వారియర్జ్ 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 139 పరుగులు లక్ష్యాన్ని 42 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేశారు.
ప్రారంభంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు మంచి పరుగులు చేసేందుకు కృషి చేశారు. కానీ యూపీ వారియర్జ్ బౌలర్ల(bowlers) దాటికి సోఫీ డివైన్, ఎలీస్ పెర్రీ ఔట్ అయిన తర్వాత ఇక మిగతా ఆటగాళ్లు సైతం పెద్దగా పరుగులు చేయలేదు. కనికా, నైట్, పాటిల్, 8, 2, 15 పరుగులు చేసి ఔట్ అయ్యారు. మరోవైపు ఎరిన్, రీచా ఘోష్, రేణుకా సింగ్, సుహనా కూడా 12, 1, 5, 3 రన్స్ మాత్రమే చేసి వెనుదిరిగారు. దీంతో ఆర్సీబీ(Rcb) జట్టు 138 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. ఇక తర్వాత వచ్చిన UPW జట్టు మొదటి ఆరు ఓవర్లలోనే 55 పరుగులు చేసింది. తర్వాత విజృంభించిన ఓపెనర్లు లక్ష్యాన్ని సునాయసంగా పూర్తి చేశారు. కానీ యూపీ వారియర్స్(UPW) జట్టు ఆటగాళ్లను ఔట్ చేయడంలో ఆర్సీబీ ప్లేయర్స్ విఫలమయ్యారని చెప్పవచ్చు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మహిళలకు కూడా పురుషులకు లభించిన అదృష్టమే దక్కినట్లు అనిపిస్తుంది. స్మృతి మంధాన(Smriti Mandana) నేతృత్వంలోని జట్టు 4 మ్యాచ్‌ల తర్వాత కూడా పోటీలో తమ ఖాతా తెరవలేదు. ఈ జట్టు మొదట ఢిల్లీ క్యాపిటల్స్‌తో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. తర్వాత మార్చి 8న ముంబై ఇండియన్స్‌తో 9 వికెట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత గుజరాత్ జెయింట్స్‌తో ఓటమి పాలయ్యారు. తాజాగా యూపీ వారియర్జ్ జట్టుపై గెలుపొందలేదు. దీంతో బెంగళూరు జట్టు వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. ఈ సీజన్లో వారి వైఫల్యాలకు ప్రధాన కారణం వారి స్టార్ ప్లేయర్ల ఫామ్, ముఖ్యంగా కెప్టెన్ మంధాన(Smriti Mandana), ఎల్లీస్ పెర్రీ(ellyse perry)వంటి వారని చెప్పవచ్చు.