»Irctc Scam Ed Conducts Raids At Tejashwi Yadavs Delhi Residence
IRCTC scam: తేజస్వి యాదవ్ నివాసంలో ఈడీ సోదాలు
ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుండి (Land for jobs scam case) ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం (Lalu Prasad Yadav family) భూములు తీసుకున్నదన్న అభియోగాల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కేంద్ర విచారణ సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) తేజస్వి యాదవ్ నివాసంలో ఢిల్లీలోని (Tejaswi Yadav) నివాసంలో సోదాలు నిర్వహించింది.
ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుండి (Land for jobs scam case) ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం (Lalu Prasad Yadav family) భూములు తీసుకున్నదన్న అభియోగాల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కేంద్ర విచారణ సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) తేజస్వి యాదవ్ నివాసంలో ఢిల్లీలోని (Tejaswi Yadav) నివాసంలో సోదాలు నిర్వహించింది. కొద్ది రోజుల క్రితమే లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu prasad yadav), రబ్రీ దేవిని (Rabri Devi) ప్రశ్నించింది. ఇప్పుడు తనిఖీలు చేస్తోంది. బీహార్ (Bihar), ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh), మహారాష్ట్ర లోని (Maharashtra) ఆయన కుటుంబానికి చెందిన పదికి పైగా ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. యూపీఏ అధికారంలో ఉన్న 2004 నుండి 2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా (lalu prasad yadav railway minister) ఉన్నారు. ఆ సమయంలో రైల్వే ఉద్యోగుల నియామక ప్రక్రియ జరిగింది. పలువురు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు లాలూ కుటుంబం వారి నుండి భూములు, ఆస్తులు తీసుకున్నట్లుగా అభియోగాలు ఉన్నాయి.