TV Rama Rao: వైసీపీకి షాక్.. గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే
వైసీపీ(Ycp)కి షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు(TV Rama Rao) పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన ఏ పార్టీలో చేరనున్నారో చెబుతానన్నారు. తన అనుచరులతో కలిసి చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. 2009 ఎన్నికల్లో టీవీ రామారావు(TV Rama Rao) కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ(TDP) తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు.

ఆ తర్వాత ఓ కేసులో టీవీ రామారావు(TV Rama Rao) ఇరుక్కున్నారు. ఆ కేసుకు సంబంధించి రాజకీయంగా చాలా ఇబ్బందులను టీవీ రామారావు ఎదుర్కొన్నారు. 2014లో ఆయన టీడీపీ(TDP) టికెట్ రాకపోయినా జవహర్ కు సపోర్ట్ చేశారు. ప్రచారంలో పాల్గొని టీడీపీ విజయానికి కృషి చేశారు.
2019లో కూడా టీవీ రామారావు(TV Rama Rao)కు టికెట్ రాలేదు. దీంతో ఆ సంవత్సరంలోనే జగన్ సమక్షంలో వైసీపీ(YCP)లో చేరిపోయారు. కొవ్వూరు నుంచి పోటీ చేసిన తానేటి వనిత గెలుపు కోసం టీవీ రామారావు(TV Rama Rao) కృషి చేశారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా కనిపించడం లేదు. మరోవైపు ఆయన ఏ పార్టీలో చేరుతారోనని సర్వత్రా చర్చ నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ(YCP)కి ఆయన రాజీనామా చేయడం పట్ల తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ కలకలం చెలరేగింది.