»Komatireddy Rajagopal Has Once Again Challenged It Minister Ktr March 10th 2023
KTR:కు మరోసారి సవాల్ విసిరిన కోమటిరెడ్డి రాజగోపాల్
మీకు విశ్వసనీయత, నిజాయితీ ఉంటే తాను బీజేపీలో చేరినందుకు 18వేల కోట్ల కాంట్రాక్టు పొందానని చేసిన ఆరోపణలను నిరూపించాలని బీజేపీ(BJP) నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal reddy) మంత్రి కేటీఆర్(KTR)కు సవాల్ విసిరారు. తనపై తప్పుడు ప్రచారం చేసి మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ గెలిచిందని పేర్కొన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ప్రధాన పార్టీల నేతలు ఇప్పటినుంచి సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి కేటీఆర్(KTR)కు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal reddy) మరోసారి సవాల్ చేశారు. తాను బీజేపీ(BJP)లో చేరినందుకే 18 వేల కోట్ల రూపాయల కంట్రాక్ట్ వచ్చిందని కేటీఆర్ ఆరోపించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో కేటీఆర్ కు విశ్వసనీయత, నిజాయితీ ఉంటే ఈ అంశాన్ని నిరూపించాలన్నారు. గోబెల్స్ ప్రచారం నా విషయంలో పని చేస్తుందని భావించవద్దని మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్(twitter) వేదికగా స్పష్టం చేశారు. అయితే ఈ ట్వీట్ చూసిన పలువురు సవాలు చేయడం సమయం వృధా సార్, వారు అవినీతి కూరుకుని ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు.
KTR if you have an iota of credibility and honesty, once again I challenge you to prove that I got the 18000 cr contract for joining BJP and don’t think Goebbels propaganda will work in my case.
— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) March 10, 2023
మరోవైపు ఇటీవల ఇదే అంశంపై తిరుమల(tirumala) దేవుడి మీద ప్రమాణం చేసి తాను అమ్ముడు పోలేదని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) స్పష్టం చేశారు. తాను 18 వేల కోట్ల రూపాయలకు అమ్మడు పోయినట్లు ఆరోపణలు చేసిన మంత్రి కేటీఆర్(KTR) ఆధారాలతో సహా దమ్ముంటే రుజువు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కొలేక తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. తన 55 ఏళ్ల జీవితంలో ఎప్పుడూ కూడా డబ్బుల(money) కోసం అమ్ముడు పోలేదన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని ఆరోపించారు. కుటుంబ, నియంత పాలన కొనసాగుతుందని గుర్తుచేశారు. అలాంటి ప్రభుత్వాన్ని దించాలని ప్రజలకు(people) సూచించారు.
తాను రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయానని తప్పుడు ప్రచారం చేసి మునుగోడు ఎన్నికల్లో(munugode by election) బీఆర్ఎస్(BRS) పార్టీ గెలిచిందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆ క్రమంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తనను ఓడించారని వెల్లడించారు. కానీ నైతికంగా బీజేపీతోపాటు తాను గెలిచానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తప్పకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.