»Sensex Which Lost 700 Points Stock Market In Huge Losses March 10th 2023
Stock Market: 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు వారంతంలో(friday) భారీ నష్టాల(heavy losses)తో కొనసాగుతున్నాయి. ఒక దశలో బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 700 పాయింట్లు కోల్పోగా, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీ 202కిపైగా పాయింట్లను నష్టపోయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ(BANK NIFTY) సూచీ ఒక సమయంలో ఏకంగా 810 పాయింట్లను కోల్పోయింది.
indian stock market losses december 21st 2023 sensex loss 440 points
దేశీయ స్టాక్ మార్కెట్లు వారంతంలో(friday) భారీ నష్టాల(heavy losses)తో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల దృష్యా దేశీయ మార్కెట్లు కూడా దిగువకు పయనీస్తున్నాయి. ఈ క్రమంలో ఒక దశలో బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 700 పాయింట్లు కోల్పోగా, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీ 202కిపైగా పాయింట్లను నష్టపోయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ(BANK NIFTY) సూచీ ఒక సమయంలో ఏకంగా 810 పాయింట్లను కోల్పోయింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 59,125కు దగ్గరగా కొనసాగుతుండగా, నిఫ్టీ 17,408 వద్ద కదలాడుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ 40,581కు చేరువైంది.
యూఎస్(USA) మార్కెట్లు గురువారం నష్టాలతో ముగియడంతోపాటు ఆసియా మార్కెట్లు సైతం నష్టాలతో ప్రారంభం కావడంతో ఇండియన్ స్టాక్ మార్కెట్ సూచీలు సైతం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. దీంతోపాటు వడ్డీ రేట్లు పెరుగుతాయనే భయాందోళనలు కూడా మార్కెట్ పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశీయ బ్యాంకింగ్ సంస్థలు స్టాక్స్ అన్ని అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, కొటక్ మహీంద్రా, ఎస్బీఐ, టాటా మోటార్స్, టాటా స్టీల్స్ వంటి 11 కంపెనీల షేర్స్ టాప్ నష్టాల్లో ఉన్నాయి.