»Hyderabad 3 Months Traffic Diversions From Indira Park To Vst Route Due To Steel Bridge Works
Hyderabad వాసులకు గమనిక.. 3 నెలలు ఈ రోడ్లు బంద్
అభివృద్ధి పనుల కోసం ప్రజలు కొన్ని రోజులు సహకరించాలని విన్నవించారు. మళ్లింపుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లితే ప్రయోజనంగా ఉంటుందని చెప్పారు. స్థానికులు సహకరించాలని కోరారు.
ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతున్న హైదరాబాద్ (Hyderabad) విశ్వనగరం (Global City) దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. మౌలిక సదుపాయాలు (Infrastructure) శరవేగంగా మెరుగవుతున్నాయి. రోడ్లు (Roads), పారిశుద్ధ్యం, పచ్చదనం (Greenary) వంటి వాటికి తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా ట్రాఫిక్ (Traffic) రద్దీని తగ్గించేందుకు భారీ ఎత్తున ఫ్లై ఓవర్లు (Fly Overs), ఫుట్ ఓవర్ బ్రిడ్జి (Foot Over Bridge)లు తదితర పనులు జరుగుతున్నాయి. ఈ పనులతో హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. తాజాగా ఇందిరా పార్క్ (Indira Park) నుంచి వీఎస్టీ (VST) వరకు అతి పొడవైన స్టీల్ బ్రిడ్జి (Steel Bridge) నిర్మాణం చేస్తున్నారు. ఈ పనులు శరవేగంగా చేసేందుకు ట్రాఫిక్ మళ్లింపులు (Traffic Diversions) చేస్తున్నారు. హైదరాబాద్ ప్రజలు గమనించాలని పోలీసు (Police), జీహెచ్ఎంసీ (GHMC) ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ (Tank Bund)లో ఇందిరాపార్క్ నుంచి అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా వీఎస్టీ వరకు అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నది. దాదాపు సగం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను పూర్తి చేయాలని ఇటీవల మంత్రి కేటీఆర్ (KT Rama Rao) ఆదేశించారు. ఈ పనులను స్వయంగా పరిశీలించిన విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యేతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. త్వరగా పనులు పూర్తి చేసి మే వరకు బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పనులు చురుగ్గా సాగించేందుకు ఆ మార్గాల్లో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. మార్చి (March) 10 నుంచి జూన్ (June) 10వ తేదీ వరకు దాదాపు మూడు నెలల పాటు ఈ మార్గాల్లో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మళ్లింపు ఇలా.. – చిక్కడపల్లి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా అశోక్ నగర్ వెళ్లే వాహనదారులు సుధా నందిని హోటల్ లేన్ వద్ద ఎడమ వైపు తీసుకుని సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్ట్రీట్ నంబర్ 9 మీదుగా రాకపోకలు సాగించాలి.
– వీఎస్టీ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా అశోక్ నగర్ వెళ్లాలనుకునే వాహనదారులు క్రాస్ రోడ్డులోని హేబ్రోన్ చర్చి లేన్, ఆంధ్రా కేఫ్, జగదాంబ ఆస్పత్రి మీదుగా అశోక్ నగర్ క్రాస్ రోడ్డు, ఇందిరా పార్కుకు చేరుకోవచ్చు.
– ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కు వెళ్లే వాహనదారులు హేబ్రోన్ చర్చి లేన్, ఆంధ్రా కేఫ్, జగదాంబ ఆస్పత్రి మీదుగా చిక్కడపల్లి ప్రధాన రోడ్డుకు చేరుకోవాలి.
– అశోక్ నగర్ క్రాస్ రోడ్డు నుంచి స్ట్రీట్ నంబర్ 9 మీదుగా సిటీ సెంట్రల్ లైబ్రరీ, సుధా నంది హోటల్ లేన్, చిక్కడపల్లి మెయిన్ రోడ్డు చేరుకోవాలి.
– ఏమైనా ఇబ్బందులు ఎదురైతే హెల్ప్ లైన్ నంబర్ 90102 03626లో సంప్రదించాలని పోలీసులు సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపులపై సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని పోలీస్ అధికారులు తెలిపారు. తొలి రోజు గందరగోళం ఏర్పడే అవకాశం ఉండడంతో పోలీసులు దగ్గరుండి వాహనదారులకు సూచనలు చేశారు. అభివృద్ధి పనుల కోసం ప్రజలు కొన్ని రోజులు సహకరించాలని విన్నవించారు. మళ్లింపుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లితే ప్రయోజనంగా ఉంటుందని చెప్పారు. స్థానికులు సహకరించాలని కోరారు.