»Telangana Bandi Sanjay Fire On Kalvakuntla Kavitha Delhis Deeksha
Kavitha Protest దీక్షలు చేసే అర్హత కవితకు లేదు: బండి సంజయ్
మహిళా రిజర్వేషన్ల బిల్లు (Women's Reservation Bill) కోసం ఢిల్లీ (New Delhi)లో కవిత దీక్ష చేస్తుండగా ఆమెకు పోటీగా హైదరాబాద్ (Hyderabad)లో బీజేపీ ‘మహిళ గోస- బీజేపీ భరోసా దీక్ష’ అనే కార్యక్రమం చేపట్టింది. హఠాత్తుగా ఈ దీక్ష పెట్టడానికి కారణం కవిత దీక్షను దారి మళ్లించేందుకు, హైప్ తగ్గించేందుకు చేసినట్లు తెలుస్తోంది.
దీక్షలు చేసే అర్హత బీఆర్ఎస్ పార్టీ (BRS Party ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ (Telangana) మహిళలు తలదించుకునే దుస్థితి తెచ్చారని విమర్శించారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తమదని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు (Women’s Reservation Bill) కోసం ఢిల్లీ (New Delhi)లో కవిత దీక్ష చేస్తుండగా ఆమెకు పోటీగా హైదరాబాద్ (Hyderabad)లో బీజేపీ ‘మహిళ గోస- బీజేపీ భరోసా దీక్ష’ అనే కార్యక్రమం చేపట్టింది. హఠాత్తుగా ఈ దీక్ష పెట్టడానికి కారణం కవిత దీక్షను దారి మళ్లించేందుకు, హైప్ తగ్గించేందుకు చేసినట్లు తెలుస్తోంది. కవితకు పోటీగా చేపట్టిన దీక్షలో బండి సంజయ్ మాట్లాడాడు.
‘మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై సీఎం కేసీఆర్ కనీసం స్పందించడం లేదు. మహిళలపై వేధింపుల కేసుల్లో దేశంలో రెండో స్థానంలో తెలంగాణ నిలిచింది. మహిళా సర్పంచ్ లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల (MLAs) దగ్గరకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మహిళా బిల్లుపై బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయలేదు. విదేశీ, ఆర్థిక మంత్రులను మహిళలను చేసిన ఘనత బీజేపీది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు కనీస ప్రాధాన్యం ఇవ్వడం లేదు. నిన్న మంత్రివర్గ సమావేశంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ఎందుకు మాట్లాడలేదు? వచ్చే ఎన్నికల్లో 33 శాతం మహిళలకే టికెట్లు ఇస్తామని కేసీఆర్ ఎందుకు చెప్పడం లేదు? ఎమ్మెల్సీ కవిత తెలంగాణ మహిళలు తలదించుకునే దుస్థితి తెచ్చారు. కవిత చేసే దందాలో తెలంగాణ మహిళలకు వాటా ఇస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీలో మహిళలే లేరు? కవిత పాపులారిటీ తగ్గిపోతుందని.. బీఆర్ఎస్ పార్టీలో వేరే మహిళలను మాట్లాడనివ్వరు’ అని పేర్కొన్నాడు.
‘ఈడీ నోటీసు (ED Notice) వస్తుందని భయపడి.. ఈ రోజు కవిత దీక్ష చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకే అతీగతి లేదు.. ఢిల్లీ వెళ్లి దీక్ష చేస్తే ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలపై ఈడీ దాడులు జరిగితే సీఎం కేసీఆర్ స్పందించలేదు. సీఎం కేసీఆర్ కూతురుకి ఈడీ నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ నేతలు స్పందిస్తారా? కవిత చేసిన దందాపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు. కవిత చేసిన దందాపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించడం లేదు? లిక్కర్ కుంభకోణంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి ఏమైనా సంబంధం ఉందా ? ఎందుకు స్పందించడం లేదు? కాంగ్రెస్ – బీఆర్ఎస్ ఒక్కటే. మహిళలపై దాడులు చేసే వారిని బీఆర్ఎస్, ఎంఐఎం జెండాలు కాపాడుతున్నాయా? ’అని బండి సంజయ్ ప్రశ్నించాడు.