BRS MLC : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దేశరాజధాని ఢిల్లీలో దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద్ ఆమె ఈ దీక్ష చేపట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పెట్టాలని కోరుతూ కవిత నేతృత్వంలో ఇవాళ ఒక్క రోజు దీక్ష నిర్వహిస్తున్నారు. కాగా...ఆమె దీక్షకు అనూహ్య స్పందన లభిస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దేశరాజధాని ఢిల్లీలో దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద్ ఆమె ఈ దీక్ష చేపట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పెట్టాలని కోరుతూ కవిత నేతృత్వంలో ఇవాళ ఒక్క రోజు దీక్ష నిర్వహిస్తున్నారు. కాగా…ఆమె దీక్షకు అనూహ్య స్పందన లభిస్తోంది.
కవిత చేపట్టిన దీక్షకు తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో మహిళా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కవిత దీక్షకు వారంతా మద్దతు తెలిపారు. దీక్షకు మంత్రులు సబిత, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, పలువురు ఎమ్మెల్యేలు రేఖానాయక్, పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మద్దతు పలికారు. దేశంలోని 18 పార్టీల నాయకులు సంఘీభావం పలికారు. దీక్ష సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగుతుంది.
కాగా… ఆమె దీక్షలో సాధారణ మహిళలు సైతం వేల సంఖ్యలో పాల్గొనడం విశేషం. వి సపోర్ట్ కవితక్క, వీ ఆర్ విత్ కవితక్క పేరిట ఉన్న స్లోగన్స్ చేతపట్టి.. వారు కూడా ఈ దీక్షలో పాల్గొనడం విశేషం.
ఇదిలా ఉండగా… కవిత.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెను ఈ దీక్ష అనంతరం ఈ స్కాం నేపథ్యంలో ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు.