YS Viveka murder case: అవినాశ్ రెడ్డి పిటిషన్, ఇంప్లీడ్ చేయాలని కోర్టుకు వివేకా కూతురు
వైయస్ వివేకానంద (YS Vivekananda Reddy) కూతురు సునీత (Suneetha Narreddy) కూడా తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కారు. అవినాష్ పిటిషన్ పైన విచారణలో తనను ఇంప్లీడ్ చేయాలని (implied petition) ఆమె కోరుతున్నారు.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy murder case) రోజుకో మలుపు తిరుగుతోంది. తనను అరెస్ట్ (arrest) చేయకుండా నిలువరించడంతో పాటు వివిధ అంశాలను కోరుతూ కడప పార్లమెంటు వైయస్ అవినాశ్ రెడ్డి (kadapa mp ys avinash reddy) తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) నిన్న పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా వైయస్ వివేకానంద (YS Vivekananda Reddy) కూతురు సునీత (Suneetha Narreddy) కూడా తెలంగాణ హైకోర్టు (Telangana High Court) మెట్లు ఎక్కారు. అవినాష్ పిటిషన్ పైన విచారణలో తనను ఇంప్లీడ్ చేయాలని (implied petition) ఆమె కోరుతున్నారు. అవినాశ్ ప్రస్తావించిన అంశాలపై తన వాదనలు కూడా వినాలని ఆమె చెబుతున్నారు. తన వాదనలు విన్న తర్వాతనే అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy) పిటిషన్ పైన స్పందించాలని అంటున్నారు. సునీత ఆరోపణలు, పిటిషన్ ఆధారంగానే ఈ కేసులో సీబీఐ రంగంలోకి దిగింది. తన తండ్రి హత్య (Vivekananda murder) కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె కోరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, ఈ హత్య కేసులో (Murder Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ (Kadapa MP Avinash Reddy) శుక్రవారం మరోసారి సీబీఐ విచారణకు (cbi investigation)హాజరు అవుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు సీబీఐ విచారణ హాజరైన ఆయన ఇప్పుడు హాజరుకావడం ఇది మూడోసారి. ఈ కేసుకు సంబంధించి తనకు తెలిసిన విషయాలను ఇప్పటికే చెప్పానని ఆయన అంటున్నారు. ప్రస్తుతం విచారణ తన ఫ్యామిలీ టార్గెట్గా జరుగుతోందని ఆరోపించారు. హత్య తర్వాత ఘటన స్థలానికి వెళ్లే సరికి అక్కడ ఒక లేఖ ఉందని, ఆ లేఖను దాచి పెట్టారని, అది హత్య అని ఆ లేఖలో స్పష్టంగా ఉందని, లేఖపై సీబీఐ అధికారులు ఏం నిర్ణయించుకుంటారో చూడాలని అంటున్నారు. అప్రూవర్ గా (approver) మారిన దస్తగిరి సమాచారం ఆధారంగా తన విచారణ సాగుతోందని, తన వర్షన్ ను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన అంటున్నారు. తన విచారణ న్యాయవాది సమక్షంలో జరగాలని, ఆడియో, వీడియో రికార్డ్ కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే.
సీబీఐ అతనిని మరోసారి విచారణకు పిలిచింది. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణను ఆడియో (audio), వీడియో (video) రికార్డింగ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విచారణ లాయర్ సమక్షంలో జరిగేలా చూడాలని కోరారు. సీబీఐ తనకు 150 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిందని, ఆ నోటీసుల ప్రకారం తనను అరెస్ట్ చేయకూడదని సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని (YS Bhaskar Reddy) కూడా సీబీఐ విచారించనుంది. ఈ నెల 12వ తేదీన విచారణకు రావాలని నోటీసులు పంపించింది విచారణ సంస్థ.