Breaking News : టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. ఇటీవల టర్కీ లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి 40వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కోట్లలో ఆస్తి నష్టం కలిగింది.
టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. ఇటీవల టర్కీ లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి 40వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కోట్లలో ఆస్తి నష్టం కలిగింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ భూకంపం తీవ్రత నుంచి జనాలు ఇంకా బయటపడనేలేదు. తాజాగా మరోసారి అక్కడ భూ ప్రకంపనలు వచ్చాయి.
సోమవారం రాత్రి హటే ప్రావిన్స్ లోని అంటక్యాలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతగా నమోదైనట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ భూకంపం వల్లన ముగ్గురు మృతి చెందినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. 213 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని టర్కీ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సులేమాన్ తెలియజేశారు. టర్కీ భూమి లోపల టెక్టోనిక్ ప్లేట్లలో కదలికలు యాక్టీవ్‌గా ఉండటంతో భూకంపాలు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశాలు ఉంటాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు.