Earth Quake: కొత్తసంవత్సరం రోజున జపాన్లో భూకంపం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. జపాన్లోని నార్త్ సెంట్రల్ ప్రాంతంలో ఈరోజు 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఎంత ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందో అనే విషయంపై క్లారిటీ లేదు. ఈ భూకంపం కారణంగా ఆ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. జపాన్ పశ్చిమ తీరంలోని ఇషికావా, నైగటచ టయోమా రాష్ట్రాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇషికావాలోని నాటో తీర ప్రాంతంలో 5 మీటర్ల ఎత్తుగల అలలు దూసుకెళ్లినట్లు సమాచారం. తీర ప్రాంతాల నుంచి ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.