»Naga Chaitanya Dhootha Web Series Release Date December 1st Fixed
Naga Chaitanya: ‘ధూత’ డేట్ వచ్చేసింది!
ప్రస్తుతం స్టార్ హీరోలు సినిమాలే కాదు. ఓటిటిల కోసం వెబ్ సిరీస్‌లకు కూడా చేస్తున్నారు. అక్కినేని నాగచైతన్య చేస్తున్న ఫస్ట్ వెబ్ సిరీస్ ధూత(Dhootha web series). విక్రమ్ కె.కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సిరీస్ రిలీజ్ డేట్‌ను తాజాగా లాక్ చేశారు.
Sam Acting In Family Man Series Is Amazing:Naga Chaitanya
అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) ఓటిటిలో లక్ చేసుకోవడానికి వచ్చేస్తున్నాడు. ఓ వైపు సినిమాలు చేస్తునే మరోవైపు ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు నాగ చైతన్య. అప్పుడెప్పుడో అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ధూత అనే వెబ్ సిరీస్‌ను అనౌన్స్ చేశాడు. అక్కినేని హీరోలకు ‘మనం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి అయ్యి చాలా కాలం అయ్యింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవడం.. చైతన్య సినిమాలతో బిజీగా ఉండడంతో ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ధూత రిలీజ్ డేట్ లాక్ చేశారు. డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ధూత’ డిజటల్ స్ట్రీమింగ్కు రానున్నట్టుగా అఫిషీయల్‌గా కన్ఫామ్ చేశారు.
ఈ పోస్టర్లో నాగ చైతన్య ఇంటెన్స్ లుక్(look) బాగుంది. ఇక ఈ సిరీస్‌లో నాగచైతన్య జర్నలిస్ట్ సాగర్ పాత్రలో కనిపించనున్నాడు. మొత్తంగా ఎనిమిది ఎపిసోడ్లుగా రానుంది ధూత సిరీస్(Dhootha web series). ఈ సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ కీ రోల్ ప్లే చేశారు. ఇక చివరగా కస్టడీ సినిమాతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిన నాగ చైతన్య.. ప్రస్తుతం కార్తికేయ2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పాన్ ఇండియా(pan india) రేంజ్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. మరి ఈ సినిమా కంటే ముందు.. ‘ధూత’గా చైతన్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.