»Vijay Devarakonda Out Of From The Sankranthi Race
Vijay Devarakonda: ఆ రేసు నుంచి విజయ్ దేవరకొండ ఔట్?
ఐరనే వంచాలా ఏంటీ? అంటూ ఈ మధ్య సోషల్ మీడియాను షేక్ చేశాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). దీంతో రౌడీ సినిమా దూసుకొస్తుంది.. అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ మూవీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది.
లైగర్ వంటి ఫ్లాప్ తర్వాత ఎట్టకేలకు ఖుషి సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఫ్యామిలీ స్టార్(family star) గ్లింప్స్‌తో రచ్చ చేశాడు రౌడీ. తనకు గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్‌తో కలిసి విజయ్ చేస్తున్న సినిమా ఇది. అందుకే.. ఫ్యామిలీ స్టార్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. టైటిలే ఫ్యామిలీ స్టార్ కాబట్టి.. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేశాడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). ప్రముఖ నిర్మాత దిల్ రాజు(dil raju) నిర్మిస్తున్న ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోను సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
సంక్రాంతి రేసు(sankranti race)లో మహేష్ బాబు, రవితేజ లాంటి స్టార్ హీరోలున్నప్పటికీ.. రౌడీ తగ్గే ఛాన్సే లేదని అనుకున్నారు. పైగా ప్రొడ్యూసర్ దిల్ రాజు కాబట్టి.. సంక్రాంతి వార్ మామూలుగా ఉండదని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు సంక్రాంతి రేసు నుంచి విజయ్ దేవర కొండ అవుట్ అయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే.. ఎప్పటి నుంచో ఫ్యామిలీ స్టార్ షూటింగ్ కోసం అమెరికా వెళ్ళడానికి చిత్ర యూనిట్ ట్రై చేస్తోంది. కానీ, వీసాలు రాకపోవడంతో అమెరికా షెడ్యూల్ ఆగిపోయిందని.. దీంతో బ్యాంకాక్‌లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. కానీ ఇప్పుడు మళ్లీ బ్యాంకాక్ వదిలేసి.. అమెరికాలోనే షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. వీసాల కోసం మళ్లీ అప్లై చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి కారణాల వల్ల సంక్రాంతికి ఫ్యామిలీ స్టార్ రావడం కష్టమేనని అంటున్నారు.