»Megastar Chiranjeevi Leaks Video Again Bhola Shankar Movie
Chiranjeevi leaks: మళ్లీ మొదలెట్టిన మెగాస్టార్!
చిరు లీక్స్(Chiranjeevi leaks) అంటూ మెగాస్టార్ చేసే సందడి మామూలుగా ఉండదు. అఫీషియల్ అప్డేట్స్ కంటే ముందే.. తన సినిమా పాటలను లీక్ చేసి మెగాభిమానులకు కిక్ ఇవ్వడం చిరంజవీ స్టైల్. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న భోళా శంకర్ మూవీ నుంచి వచ్చిన చిరు లీక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోయిన సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ దగ్గర దుముదులిపేశారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది వాల్తేరు వీరయ్య. అయితే ఈ సినిమాలోని శ్రీదేవి సాంగ్‌ను స్విట్జర్లాండ్ సెట్స్ నుంచి లీక్ చేస్తున్నట్టు.. అఫీషియల్‌గా సోషల్ మీడియాలో సాంగ్ మేకింగ్‌ను పెట్టేశారు చిరంజీవి. ప్రమోషన్స్‌లో భాగంగా ఇదో కొత్త స్ట్రాటజీ. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశారు మెగాస్టార్. తమిళ్ మూవీ వేదాళం రీమేక్‌గా మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ అనే సినిమా చేస్తున్నారు మెగాస్టార్.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆగస్ట్ 11న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భోళా శంకర్(bhola shankar movie) నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్నారు. రీసెంట్గా ‘భోళా మేనియా’ అనే ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా మరో సాంగ్‌ను చిరు లీక్స్ పేరిట సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా నటిస్తుండగా.. చిరు చెల్లెలిగా కీర్తి సురేష్, ఆమెకి జోడిగా సుశాంత్ నటిస్తున్నాడు.
ప్రస్తుతం వీళ్ల పై సంగీత్ కార్యక్రమానికి సంబంధించిన సాంగ్ షూట్(song shoot) చేస్తున్నారు. జామ్ జామ్ జజ్జనకా అంటూ సాగే ఈ పాట కలర్ ఫుల్‌గా ఉండబోతోందని చెప్పేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్న ఈ పాటలో.. వెన్నెల కిషోర్, గెటప్ శీను, హైపర్ ఆది, రఘు బాబు ఇలా మూవీలో ఉన్న ఆర్టిస్ట్‌లు అందరూ కనిపిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. మొత్తంగా ఈ సాంగ్‌లో వింటేజ్ మెగాస్టార్‌ను చూడబోతున్నామని చెప్పొచ్చు.