టాలీవుడ్ మంచు ఫ్యామిలీ కి అంటూ ఓ క్రేజ్ ఉంది. ఒకప్పుడు మోహన్ బాబుకి హీరోగా, డైలాగ్ కింగ్ గా చాలా మంచి పేరు ఉంది. కానీ ఆ పేరుని మంచు వారసులు కొనసాగించలేకపోయారు. హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా విష్ణు సినిమాలు చేస్తుంటే…మనోజ్ మాత్రం చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. దీనికి కారణం తన పర్సనల్ జీవితం లో ఎదురైన చేదు అనుభవాలు అని తెలుస్తుంది.
మనోజ్, ప్రణతిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కారణాలు బయటకు రాకపోయినా.. ఆ తరువాత ఆ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటినుండి మనోజ్ ఒంటరిగా ఉంటున్నాడు.
అయితే ఈ మధ్య భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె.. మాజీ మంత్రి అఖిల ప్రియ సోదరి అయిన మౌనిక రెడ్డితో రెండో వివాహం చేసుకోబోతున్నాడనే వార్తల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయాన్ని గురించి మంచు మనోజ్ ని మీడియా ప్రశ్నించగా అది తన వ్యక్తిగత విషయం అని, సమయం వచ్చినప్పుడు చెబుతానని హింట్ ఇచ్చారు.
అయితే మౌనికతో వివాహానికి మోహన్ బాబు, అతని కుటుంబ సభ్యులకి ఇష్టం లేదని తెలుస్తుంది. కానీ మనోజ్ పట్టు పట్టడంతో కుటుంబ సభ్యులు ఈ వివాహానికి అయిష్టంగానే అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంచు కుటుంబంలో వివాదాలు మొదలైనట్లు తెలుస్తోంది. వీరి పెళ్లి తర్వాత ఆస్తి పంపకాలు కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఇప్పటి వరకు అయితే… ఈ విషయంపై మంచు కుటుంబం నోరు విప్పింది లేదు. ఏం జరుగుతుందో చూడాలి.