»Man Uses Pet Python During Street Fight In Canada
Canada : ఎదుటి వ్యక్తిని కొట్టడానికి పామును ఉపయోగించాడు
కొట్టుకోవడానికి పెంపుడు పామును ఉపయోగించాడో వ్యక్తి. పామును బెల్టులాగా ఉపయోగించి ఎదుటి వ్యక్తిపై దాడిచేయడంలో స్థానికులు భయంతో పాటు ఆశ్చర్యానికి గురయ్యారు.
మామూలుగా ఇద్దరు వ్యక్తులు గొడవపడతారు. గొడవ ఎక్కువ అయితే కొట్టుకుంటారు. అందుకు ఏదో ఒక స్టిక్ ( కట్టెను ) ఉపయోగిస్తారు. కానీ ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిపై దాడిచేయడానికతన పెంపుడు కొండ చిలువను ఉపయోగించాడు. కొండచిలువను పట్టుకుని దాంతో ఎదుటి వ్యక్తిని కొట్టసాగాడు. ఈ ఘటన కెనడాలోని టొరంటోలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారంది. గత బుధవారం అనగా మే 10వ తేదీ రాత్రి 11.50 గంటలకు కెనెడాలోని టొరోనోటోలోని డుండాస్ స్ట్రీట్ వెస్ట్‌లో ఈ ఘటప జరిగింది. వీడియోలో, ఒక వ్యక్తి తన పెంపుడు కొండచిలువను పూర్తి శక్తితో ఊపుతూ, రోడ్డు మధ్యలో నిలబడి ఒక వ్యక్తిపై దాడి చేయసాగాడు. కొండచిలువతో విపరీతంగా కొట్టడంతో ఎదుటివ్యక్తి తీవ్ర భయానికి గురయ్యాడు. పోలీసులు వచ్చే లోపే అవతలి వ్యక్తిపై చాలాసార్లు దాడి చేశారు.
పోలీసులు శనివారం ఓ ప్రకటనను విడుదల చేశారు.. ఓ వ్యక్తి మరో వ్యక్తిని కొండచిలువను ఉపయోగించి కొడుతున్నట్లు తమకు సమాచారం అందిందని కాల్ వచ్చిందని తెలిపారు. వెంటనే అధికారుల బృందాన్ని ఘటనా స్థలానికి పంపినట్లు చెప్పారు.
ఓ వ్యక్తి తన పాము కొండచిలువతో వీధిలో తిరుగుతున్నాడని ప్రచారం జరుగుతోంది. అనంతరం ఆ వ్యక్తి బాధితుడి వద్దకు వెళ్లాడు. అప్పుడు అకస్మాత్తుగా, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అదికాస్తా గొడవకు దారితీసింది. దీంతో ఆ వ్యక్తి తన పెంపుడు పామును ఉపయోగించి ఎదుటి వ్యక్తిపై దాడిచేయసాగాడు. అది చూసిన స్థానికులు విచిత్రంగా చేడసాగారు. అంతలోనే తేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. పోలీసులు వచ్చేవరకు అతను ఎదుటివ్యక్తిపై దాడిచేయడం కెమెరాలో రికార్డ్ అయ్యింది. విచారణ అనంతరం నిందితుడు లారేనియో అవిలాను అని పోలీసులు తెలిపారు. ఇతను 45ఏళ్ల వ్యక్తిపై దాడిచేయడంతోపాటు పాముకు నొప్పికలిగించినట్లు అభియోగాలు మోపారు. గురువారం అనగా మే 11న కోర్టుముందు హాజరుపరిచారు పోలీసులు.